ఈ రాశివారు వారంలో వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు

21 Nov, 2021 06:46 IST|Sakshi

ఈ వారం ఫోటో స్టోరీస్‌

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. కోర్టు వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆలయాలు  సందర్శిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఉత్సవాలు,  శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. విధి నిర్వహణలో ప్రోత్సాహం. రాజకీయవర్గాలకు ఆదరణ. వారం మధ్యలో విందులు, వినోదాలు. భూలాభాలు. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బం«ధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సుదీర్ఘకాల వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.  పారిశ్రామికవర్గాలకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. సోదరులతో కలహాలు. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మొదట్లో కొన్నిæ వివాదాలు నెలకొన్నా  క్రమేపీ తొలగుతాయి. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. రాబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో మరింత పుంజుకుంటారు. ఉద్యోగాలలో మీ సేవలకు మరింత గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ముఖ్య పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ప్రత్యర్థులను యుక్తిగా ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. వాహనాలు, భూములు  కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఎదురుచూడని అవకాశాలు. ఉద్యోగాలలో ప్రతిభ నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో  అనుకోని ఖర్చులు. మానసిక ఆందోళన. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీహనుమాన్‌ పూజలు చేయండి.


సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్నంత రాబడి సమకూరుతుంది. కుటుంబంలో మీపై ఆదరణ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థికంగా మరింత బలపడతారు. సన్నిహితులు, సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3 పా.)
నిరుద్యోగులకు  ఉద్యోగాలు దక్కుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సన్నిహితులు, సోదరులతో కష్టసుఖాలు విచారిస్తారు. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. అనుకున్న కొన్ని పనులు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అప్రయత్న కార్యసిద్ధి. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువులతో ముఖ్య విషయాలపై ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగవిధుల్లో అనుకూల పరిస్థితులు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు తొలగుతాయి. వారం మధ్యలో  మిత్రులతో తగాదాలు. శ్రమ తప్పదు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది.  ఆస్తి వివాదాలు క్రమేపీ పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త విధులు చేపట్టే వీలుంది. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. వారం చివరిలో భూవివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కుజస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఏ పని చేపట్టినా కొంత నిదానంగా పూర్తి కాగలవు.  శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. ఊహించని ధనలాభాలు. గృహం, వాహనాలు కొంటారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగ  విధులు ప్రశాంతంగా, సాఫీగా సాగుతాయి. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. మానసిక ఆందోళన. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్య వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే  మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు కూడా లభిస్తాయి. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల ద్వారా æ ఆస్తిలాభ సూచనలు ఉన్నాయి.  నూతన వ్యక్తులు పరిచయం కాగలదు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించవచ్చు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. నేరేడు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు ప్రారంభిస్తారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. సోదరుల నుంచి ఉపయుక్తమైన  సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొన్ని ప్రధాన సమస్యల నుంచి గట్టెక్కుతారు. అందరిలోనూ మీ సత్తా చాటుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేసే వీలుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో కళకళలాడతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు. పారిశ్రామికవర్గాల దీర్ఘకాలిక కోరిక నెరవేరుతుంది. వారం మధ్యలో ఇంటాబయటా ఒత్తిళ్లు. కుటుంబసమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మరిన్ని వార్తలు