Weekly Horoscope: 23 అక్టోబర్‌ నుండి 29 అక్టోబర్‌ వరకు..

23 Oct, 2022 06:51 IST|Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని పనులలో ఆటంకాలు అధిగమిస్తారు. ప్రముఖుల నుంచి అనుకూల సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణయత్నాలు  ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు పొందుతారు. వారం చివరిలో ధనవ్యయం. ఆకుపచ్చ రంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 
 
వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీలోని సేవాభావం వెలుగులోకి వస్తుంది. కొన్ని పనులు చకచకా సాగుతాయి. ఒక సమాచారం విద్యార్థులకు ఊరటనిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. బంధువిరోధాలు. నీలం, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది. 

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
రుణాలు తీరి ఊరట చెందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. ప్రధాన సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.  మీపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. తెలుపు, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది.
 
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. వారం చివరిలో ధనవ్యయం. ఎరుపు, లేతనీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. 

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రముఖుల సలహాలు పాటిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.  ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో సామాన్యలాభాలు.  ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు పదవులు అసంతృప్తి కలిగిస్తాయి. వారం మధ్యలో స్వల్ప ధనలాభం. నేరేడు రంగు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత బలపడతారు. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు దక్కుతాయి. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు  మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభించవచ్చు. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. గులాబీ రంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. 

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.  వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఉత్సాహంగా ఉంటుంది. వారం చివరిలో  వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. 

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ప్రారంభంలో సమస్యలు ఎదురైనా ఓర్పుతో అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత చురుగ్గా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆస్తి వివాదాలు. నేరేడు రంగు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. 

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. విలువైన భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. బంధువిరోధాలు. తెలుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు  పఠించండి. 

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. గృహ నిర్మాణం, కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. 

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఎంతోకాలంగా వేధిస్తున్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. 

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం మీ అంచనాలు మేరకు ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  విద్యార్థులకు అనుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు. లేత ఎరుపు రంగు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.  

మరిన్ని వార్తలు