ఈ రాశివారికి వారం మధ్యలో కుటుంబంలో చికాకులు

23 May, 2021 06:29 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ముఖ్య నిర్ణయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.  వ్యాపారాలు ఆశించిన మేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు జరుగవచ్చు, సహచరులు అన్ని విధాలా సహకరిస్తారు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంగా వివాదాల నుంచి బయటపడతారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. వ్యాపారాలు మొదట్లో నిరాశపర్చినా క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త విధులు ఉత్సాహంగా కొనసాగిస్తారు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో  ఆరోగ్యభంగం. బంధువులతో విభేదాలు. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మిత్రుల చేయూతతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలులో ముందడుగు వేస్తారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి.  వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి  నూతనోత్సాహం.  వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొత్తగా రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యభంగం. కొన్ని పాత∙సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రత్యర్థుల చర్యలను గమనిస్తూ ఉండండి. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తుల వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు  సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త వి«ధులు సవాలుగా మారవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొన్ని చిక్కులు.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. చర్చలు సఫలం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పనులు కొంత నిదానంగా పూర్తి  చేస్తారు. ఆర్థిక పరిస్థితి  కొంత అనుకూలిస్తుంది. రుణభారాలు తగ్గే అవకాశం. బంధువులు, మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఒక ప్రకటనకు ఆకర్షితులవుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు.  వ్యాపారాలలో  అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. ఆకుపచ్చ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులు అన్ని విధాలుగా సహాయపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.  వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు సాధిస్తారు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. అనారోగ్య సూచనలు. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తుతి మంచిది.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో  పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయవర్గాలకు ప్రజాదరణ మరింత లభిస్తుంది.  వారం చివరిలో  మిత్రులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు.  సంఘంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో  ఆకట్టుకుని ముందుకు సాగుతారు. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగుల కృషి కొంతమేర ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి, శ్రమ కొంతమేర తగ్గుతుంది. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. బందువులతో విభేదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు. కోర్టు వ్యవహారాలలో కొంత అనుకూలత ఉంటుంది.  వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. తగింత లాభాలు అందుతాయి.  ఉద్యోగాలలో కొత్త విధులు ఉత్సాహాన్నిస్తాయి. కళారంగం వారికి అవకాశాలు మరిన్ని దక్కే సూచనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు కొంత నిదానంగా కొనసాగిస్తారు. బంధువులు, శ్రేయోభిలాషుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహణపై చర్చలు జరుపుతారు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఒక సంఘటన మీలో కొంత మార్పు తెస్తుంది.  వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పనిభారం తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో దన వ్యయం. స్వల్ప అనారోగ్యం. మిత్రులతో కలహాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని వేడుకలకు ప్రణాళిక సిద్ధం చేస్తారు.  విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారు. ఉన్నత హోదాలలో ఉన్న వారితో పరిచయాలు. ఒక సంతోషకరమైన సమాచారం రాగలదు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉత్సాహంగా సాగుతాయి. కళారంగం వారికి వివాదాలు సద్దుమణుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి. 
-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

మరిన్ని వార్తలు