Weekly Horoscope: 26 జూన్‌ నుంచి 2 జూలై 2022 వరకు..

26 Jun, 2022 07:19 IST|Sakshi

మేషం 
(అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యమైన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడి ఉపశమనం లభిస్తుంది. కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చే సూచనలు. కుటుంబసభ్యులతో కీలక విషయాలపై చర్చిస్తారు. వాహనయోగం.  నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పొందవచ్చు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఆనుకూలమైన సమయం. పారిశ్రామికవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం  చివరిలో వ్యయప్రయాసలు. పసుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృషభం
(కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)

రుణఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆస్తులు కొనుగోలులో సమస్యలు తీరి ఒడ్డునపడతారు. చేపట్టిన  పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు మొదట్లో కొంత నిరాశ కలిగినా క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రశంసలు పొందుతారు. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు.  వారం ప్రారంభంలో ఖర్చులు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించండి.

మిథునం
(మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

ముఖ్యమైన పనుల్లో విజయం. అనుకున్న సమయానికి సొమ్ము సమకూరుతుంది. రుణాలు తీరి ఊరట లభిస్తుంది.  పోటీపరీక్షల్లో విద్యార్థుల విజయం. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై నిర్ణయం. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. వ్యాపారాలలో అధిక లాభాల సూచన. ఉద్యోగాలలో కొన్ని   అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కర్కాటకం
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

నిరుద్యోగులు, విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. అనుకున్న విధంగా ధనలాభం కలుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొన్ని చిక్కులు అధిగమిస్తారు. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు సమస్యలు తీరతాయి. వారం చివరిలో  ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఎరుపు, గులాబీ  రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

ఆర్థికంగా బలం చేకూరి అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి.  ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. విద్యార్థులు కోరుకున్న  అవకాశాలు దక్కించుకుంటారు. కుటుంబసభ్యులు మీ విధానాలను ప్రశంసిస్తారు. సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో మరిన్ని లాభాలు అందవచ్చు.  ఉద్యోగాలలో  కొన్ని అవకాశాలు తిరిగి దక్కుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు.  ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

కన్య
(ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

గతంలో చేజారిన కొన్ని, వస్తువులు తిరిగి లభ్యమవుతాయి. మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి  నిర్మాణాలలో అవాంతరాలు  అధిగమిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో స్థాయి పెరిగే సూచనలు. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు. వారం ప్రారంభంలో అనారోగ్యం,  పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

తుల
(చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

ఆశ్చర్యకరమైన రీతిలో ఆదాయం సమకూరుతుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగ నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. కళారంగం వారికి వివాదాలు తీరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడురంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. ఆస్తుల వ్యవహారాలలోనూ ఒప్పందాలు చేసుకుంటారు. ఆప్తుల నుంచి కీలక సందేశం. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు. వాహనసౌఖ్యం. నూతన విద్యావకాశాలు. గృహ నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగాలలో ఉన్నత స్థాయి. కళారంగం వారికి అనుకూల సమయం. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

ధనుస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

నూతనంగా చేపట్టిన వ్యవహారాలు సమయానికి పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు  పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం చివరిలో  కష్టానికి ఫలితం కనిపించదు.  గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం
(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

అనుకున్న పనుల్లో విజయం. పలుకుబడి పెరుగుతుంది. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరతాయి.  నూతన వ్యక్తుల పరిచయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు మరింతగా దక్కుతాయి. ఉద్యోగాలలో  వివాదాలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కుంభం
(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. కోర్టు వివాదం పరిష్కారదశకు చేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో మరిన్ని లాభాలు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు శుభవార్తలు. వారం మధ్యలో ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మీనం
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)

ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళం. సన్నిహితులతో తగాదాలు. బాధ్యతలతో సతమతమవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు  వాయిదా. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. ఆస్తులపై కొన్ని వివాదాలు. ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి ఉద్యోగాలలో ఒత్తిడులు. రాజకీయవర్గాలకు  అవకాశాలు కొన్ని దూరం కాగలవు. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మరిన్ని వార్తలు