Astrological Horoscope: ఈ వారంలో ఈ రాశివారు వాహనాలు కొనుగోలు చేస్తారు

26 Sep, 2021 06:31 IST|Sakshi

ఈ వారం రాశిఫలాలు ఫోటో స్టోరిస్‌

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి బంధువుల ప్రశంసలు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా విస్తరించేందుకు యత్నిస్తారు. ఉద్యోగాలలో   ప్రమోషన్లు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలకు ఊహించని ఆహ్వానాలు అందవచ్చు. వారం చివరిలో  వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి తోడ్పాటుతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు కొంత ఊరటనిస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆశలు. వ్యాపారాలలో అనుకున్నంతగా లాభాలు రాగలవు.  ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో  అవరోధాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. వారం చివరిలో ఆరోగ్యభంగం. మానసిక అశాంతి. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. కార్యక్రమాలలో అవాంతరాలు అధిగమిస్తారు.  కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు.  విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అవసరాలకు డబ్బు అందుతుంది. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు కీలక సమాచారం అందుకుంటారు.  రాజకీయవర్గాలకు కొత్త పదవులు రాగలవు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. 

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు.  బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. నిరుద్యోగులకు ఒక ముఖ్య సమాచారం రాగలదు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో కీలక మార్పులు జరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు కొంత అనుకూలస్థితి. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. లేత పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త విషయాలు గ్రహిస్తారు.  కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు అందుతాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. తూర్పుదిశ  ప్రయాణాలు అనుకూలం. దుర్గామాత స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. అనుకున్నది సాధించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు అధిగమిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.  ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పెట్టుబడులు అంది పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. సన్నిహితులతో మాటపట్టింపులు. ఒప్పందాలు వాయిదా. ఎరుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పైస్థాయివారి ప్రశంసలు అందుకుంటారు. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో కొన్ని ఒత్తిడులు ఎదుర్కోవల్సి ఉంటుంది. బంధువులతో విరో«ధాలు ఏర్పడతాయి. మానసిక అశాంతి. పసుపు, నేరేడు అనుకూలమైన రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేసి, విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో  చికాకులు తప్పవు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం దక్కదు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు నిదానంగా సాగుతాయి.  నిర్ణయాలలో తొందరపాటు వద్దు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు ఏర్పడతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తిలాభం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 

మరిన్ని వార్తలు