ఈ రాశివారికి వారం మధ్యలో శుభవార్తలు

27 Jun, 2021 06:32 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. నూతన పెట్టుబడులకు అవకాశం. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభించవచ్చు. రాజకీయవేత్తలకు నూతనోత్సాహం, అనుకోని పర్యటనలు. వారం చివరిలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. ఆప్తులు, బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. ఉన్నత హోదాలలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు. ఒక సమాచారం నిరుద్యోగులకు మరింత ఊరటనిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులను సైతం ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్ల నుంచి  గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు యత్నాలు ముమ్మరం చేస్తారు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. మిత్రులతో విభేదాలు. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మొదట్లో వివాదాలు నెలకొన్నా క్రమేపీ సర్దుబాటు చేసుకుంటారు.  అనుకున్న  ఆదాయం దక్కించుకుని ముందుడుగు వేస్తారు. మీ ఊహలు, అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో  విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో వ్యూహాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పైస్థాయి వారి సహాయం అందుకుంటారు. కళాకారులకు ఊహించని పిలుపు రావచ్చు.  వారం ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని వివాదాలు, సమస్యలు ఆత్మవిశ్వాసం, నేర్పుతో పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కొన్ని అవకాశాలు సాధిస్తారు.  వ్యాపారాలు నూతన పెట్టుబడులతో ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా, సమర్థతను చాటుకుని పేరు సంపాదిస్తారు. పారిశ్రామికవేత్తలు సంస్థల వికేంద్రీకరణలో పురోగతి సాధిస్తారు. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిడులు. తెలుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. దూరపు బంధువులను కలుసుకుని మనస్సులోని భావాలను వెల్లడిస్తారు. విద్యార్థులకు కీలక సమాచారం అందుతుంది. చాకచక్యంగా కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరుల నుంచి ధనలాభాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాములతో తగాదాలు తీరతాయి. ఉద్యోగాలలో ఎదురుచూస్తున్న మార్పులు రావచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో  బంధువిరోధాలు. ఆరోగ్య సమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.   కొన్ని వ్యవహారాలు సజావుగా కొనసాగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలయాలు సందర్శిస్తారు. వైద్యులు, కాంట్రాక్టర్లకు కలసివచ్చే కాలం.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కుతుంది. రాజకీయవేత్తలకు కొన్ని పదవులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో భూవివాదాలు. ఇంటాబయటా సమస్యలు. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు. క్రమేపీ సర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు శుభవార్తా శ్రవణం. అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో కొన్ని వివాదాలు తీరతాయి. కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేసి, ఆ విజయాన్ని ఆస్వాదిస్తారు. ఆదాయం కొంత పెరుగుతుంది. నూతన వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు, భాగస్వాముల చేయూత అందుతుంది. ఉద్యోగస్తులకు ఊహించని ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవర్గాల కృషి ఫలించే సమయం. వారం మధ్యలో  కొన్ని వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో కొంత గందరగోళం. రుణాల వేటలో పడతారు. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. సోదరులు, మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. స్వల్ప అనారోగ్యం.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  కుటుంబసభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు నిలిపివేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళారంగం వారికి కొంత ఊరట లభిస్తుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మీ అనుభవాలను మిత్రులతో పంచుకుంటారు.  ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఏ పని చేపట్టినా విజయం వరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టర్లకు అనుకూల వాతావరణం. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. చర్చలు సఫలం. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. గృహ నిర్మాణయత్నాలలో కదలికలు. వ్యాపారాలలో మరింతగా లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.  వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. నీలం, తెలుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్య సమాచారం తెలుసుకుంటారు. ఆశించిన ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. విద్యార్ధులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. పనుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. ఒక సంఘటన మరింత ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు, కొంటారు.  వ్యాపారాలు అనుకున్న సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో అంచనాలు ఫలించి  లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు