Weekly Horoscope: ఈ రాశి వారు వారంలో అనుకున్నది సాధిస్తారు

28 Aug, 2022 06:54 IST|Sakshi

మేషం  (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు.  వ్యాపారాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. కళాకారులకు సన్మానాలు. నలుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
పరపతి పెరుగుతుంది. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు.  ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపారాలలో  పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు  నెరవేరతాయి. విద్యార్థులు పట్టుదలతో ముందుకుసాగి విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ప్రముఖుల నుంచి ముఖ్యసందేశం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత తగ్గవచ్చు. పారిశ్రామివర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆకుపచ్చ, నేరేడురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వ్యవహారాలు నత్తనడకన కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది.  వ్యాపారాలలో కొంత సహనం పాటించాలి. ఉద్యోగాలలో మరింత పని ఒత్తిడులు. విద్యార్థుల కృషి కొంతవరకు ఫలిస్తుంది. కళారంగం వారికి చిక్కులు ఎదురుకావచ్చు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. తెలుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది.  వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత.  నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
మీ ఆశయాలు నెరవేరడంలో కుటుంబసభ్యుల చేయూత లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.   నూతన విద్యావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారి ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, తెలుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వివాదాల నుంచి  బయటపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. వారం మధ్యలో వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని ఆరాధించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి మీ అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి విషయాలలో సోదరులతో ఒప్పందానికి వస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు ఊహించని విధంగా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు సాఫీగా సాగి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. రాజకీయవర్గాలు అనుకున్నది సాధిస్తారు.  వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మీ ఊహలు కొన్ని  నిజమవుతాయి.  భూసంబంధిత వివాదాలు తీరతాయి. సమయానికి సొమ్ము అంది అవసరాలకు ఆదుకుంటుంది. చిన్ననాటి మిత్రులు ఆహ్వానాలు అందిస్తారు. వ్యాపారాలలో తగినంత లాభాలు రాగలవు.  ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. పసుపు, నేరేడురంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. ఆహ్వానాలు కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో అనూహ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి.  దైవదర్శనాలు. వారం మధ్యలో మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆదాయం ఆశించిన విధంగా పెరుగుతుంది. పెండింగ్‌లో పడిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో మీరు అనుకున్న హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.  

మరిన్ని వార్తలు