ఈ రాశివారికి వారంలో కష్టానికి తగిన ఫలితం..

28 Nov, 2021 06:24 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. పరిపరివిధాలుగా ఉన్న ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఇంటి నిర్మాణాల్లో వేగం పుంజుకుంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు రాగలవు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీనృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆలోచనలను అమలు చేస్తారు. ఇంతకాలం పడ్డ కష్టం ఫలిస్తుంది. మీలో పట్టుదల పెరుగుతుంది. కొన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు. రావలసిన సొమ్ము సమయానికి అందుకుంటారు. కుటుంబంలో విభేదాలు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు తీరతాయి. ఉద్యోగాలలో  కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో  మానసిక అశాంతి. బంధువులతో మాటపట్టింపులు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు  పఠించండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషులు మరింతగా దగ్గరవుతారు. కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. వాహనయోగం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. కళారంగం వారికి విజయాలు వరిస్తాయి. వారం మధ్యలో వృథా ధనవ్యయం. ఇంటాబయటా సమస్యలు. పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. మహాలక్ష్మీ అష్టకమ్‌ పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కుటుంబంలో వ్యతిరేకత పెరుగుతుంది. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కొన్ని డాక్యుమెంట్లు జాగ్రత్తపరచుకోండి. ఆర్థిక విషయాలలో కొంత ఆందోళన తప్పకపోవచ్చు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పనిభారం. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కీలక నిర్ణయాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు సమయానికి పూర్తి చేస్తారు.  మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన చేస్తారు. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో అనుకూల పరిణామాలు. కళారంగం వారికి చికాకులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. మేధాదక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
యత్నకార్యసిద్ధి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కీలక సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికంగా మరింత బలపడి ముందుకు సాగుతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు. ఉద్యోగాలలో ప్రమోషన్లు లభిస్తాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో  బంధువిరోధాలు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ ధ్యానం చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. ఇంతకాలం వేధించిన కొన్ని సమస్యలు తీరతాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు అందుతాయి. ఊహించనిరీతిలో బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబసమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో మానసిక అశాంతి. వ్యయప్రయాసలు. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. 

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థులు నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాల సాధనలో కుటుంబసభ్యులు చేయూతనందిస్తారు. వ్యాపారాలలో మరింతగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, విశేష గుర్తింపు. వారం మధ్యలో మిత్రులతో విరోధాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమహావిష్ణు షోడశనామ స్తుతి మంచిది.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీ ఆలోచనలకు మరింత పదను పెడతారు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వివాహాది వేడుకలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు మరింత సానుకూలంగా పూర్తి కాగలవు. సోదరులతో వివాదాలు కొలిక్కి వస్తాయి, సఖ్యత కోసం చేసే యత్నాలు సఫలం. ఇంటి నిర్మాణాల్లో వేగం పుంజుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగుపడుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. గృహ, వాహనయోగాలు ఉండవచ్చు. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. స్థిరాస్తులు విషయంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాల చిరకాల కోరిక నెరవేరే సమయం. వారం ప్రారంభంలో వృధా ధనవ్యయం. మానసిక అశాంతి. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్య ధ్యానం చేయండి. 

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నేర్పుగా సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అభివృద్ధి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. 

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించినంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. 

మరిన్ని వార్తలు