వారఫలాలు: 30 అక్టోబర్‌ నుంచి 5 నవంబర్‌ 2022 వరకు

30 Oct, 2022 06:50 IST|Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. రుణబా«దల నుంచి విముక్తి. వాహనయోగం. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతితో కూడిన బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు. వారం చివరిలో   ఇంటాబయటా ఒత్తిళ్లు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
యత్నకార్యసిద్ధి. సంతానం ఉద్యోగాలపై శుభవార్తలు. ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణాలలో ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా అడుగువేస్తారు.  రాజకీయ వర్గాలకు కొత్త పదవులు, ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కించుకుంటార. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. నేరేడు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు. పెట్టుబడులు మరిన్ని రాగలవు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు  శుభవర్తమానాలు అందుతాయి. వారం మధ్యలో మానసిక ఆందోళన. అనారోగ్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఉత్సాహంగా పనులు చేపట్టి  విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు శుభవర్తమానాలు. వారం చివరిలో శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాల విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలు కొత్త కంపెనీల ఏర్పాటులో నిమగ్నమవుతారు. వారం ప్రారంభంలో కొన్ని అంచనాలు ఫలించవు. కుటుంబంలో ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక లావాదేవీల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది.  వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఊహించని విధంగా ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధన వ్యయం. కుటుంబంలో ఒత్తిళ్లు. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఒక లేఖ మీలో ఉత్సాహాన్నిస్తుంది. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. కళాకారులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక లావాదేవీలు మందకొడిగానే సాగుతాయి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వారం మధ్యలో శుభవార్తలు. నీలం, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు కలసివచ్చేకాలం. వాహనాలు, స్థలాలు కొంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. కళాకారులకు అవకాశాలు దగ్గరకు  వస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి్తనిస్తాయి. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు రాగలవు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో  కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు  కొత్త సంస్థల ఏర్పాటు యత్నాలు కలిసివస్తాయి. వారం ప్రారంభంలో సోదరులతో విభేదాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరతాయి.  వాహనయోగం. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో పదోన్నతులు రాగలవు. వారం చివరిలో శ్రమాధిక్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, ఆభరణాల కొనుగోలు. స్థిరాస్తి విషయంలో సోదరులతో వివాదాలు తీరతాయి. కొత్త వ్యాపారాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఊహించని రీతిలో మార్పులు ఉండవచ్చు. వారం మ«ధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

మరిన్ని వార్తలు