ఈ రాశి వారికి వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు

6 Jun, 2021 06:27 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతనోత్సాహంతో వ్యవహారాలు చక్కదిద్దుతారు. పలుకుబడి, హోదాలు కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆస్తుల వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మిత్రుల నుంచి అందిన సమాచారం  కొంత ఉపయుక్తంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. కొత్త రుణాల కోసం యత్నాలు చేస్తారు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. వైద్యసేవలకు కొంత ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు. ఆస్తుల ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలు మాటపడాల్సిన పరిస్థితి. వారం మధ్యలో శుభవార్తలు, వాహనయోగం. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్తగా చేపట్టిన వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిత్రమైన కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. విద్యార్థుల యత్నాలు సానుకూలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గవచ్చు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమై ఊరట చెందుతారు. భూఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో అదనపు విధులు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయడంలో మిత్రులు సహకరిస్తారు. భూములు,వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే కొంత మెరుగుపడతాయి. ఒక ఆసక్తికర సమాచారం ఊరట కలిగిస్తుంది. ఉద్యోగవేటలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంతమేర తగ్గవచ్చు. కళారంగం వారికి వివాదాలు సర్దుకుంటాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు, వైద్యసేవలు. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కొంత సొమ్ము అందినా అవసరాలకు సరిపడదు. సోదరులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలతో సతమతమవుతారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహయత్నాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. నేరేడు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువులతో మాటపట్టింపులు. మీ ఆలోచనలు స్థిరంగా సాగక నిర్ణయాలు వాయిదా వేస్తారు. ఆస్తుల విషయంలో కొన్ని వివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవం. కళారంగం వారికి అవకాశాలు కొన్ని చేజారవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త వ్యక్తుల పరిచయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. మిత్రులతో కలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కొనసాగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూముల క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. ఇంటినిర్మాణయత్నాలు కలసివస్తాయి. బంధువుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో విభేదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. నిర్ణయాలు హఠాత్తుగా మార్చుకుంటారు. వివాహాది శుభకార్యాలు వాయిదా వేస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని చికాకులు తప్పవు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆస్తుల వివాదాలు నెలకొని సవాలుగా మారవచ్చు. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం మరింత పెరుగుతుంది. కళారంగం వారికి కొంత గందరగోళంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు మరింత జఠిలం కావచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. పసుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు