ఈ రాశివారికి ఈ వారంలో ఆరోగ్యం చికాకు పరుస్తుంది

25 Apr, 2021 06:28 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కొన్ని ఆశయాలు నెరవేరతాయి. ఆప్తుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో సోదరులు చేయూతనందిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో  పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతన అవకాశాలు. వారం చివరిలో అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. కొన్ని ఉత్సవాలకు హాజరవుతారు. జీవిత భాగస్వామి  నుంచి స్వల్ప ఆస్తిలాభ సూచనలు. ఆర్థిక వ్యవహారాలు ఆశించినరీతిలో ఉంటాయి. కొన్ని రుణబాధలు తొలగుతాయి.  వాహనాలు, స్థలాలు కొంటారు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు పొందుతారు. రాజకీయవర్గాల ఆశలు ఫలించే సమయం.  వారం ప్రారంభంలో  మనశ్శాంతి లోపిస్తుంది. సోదరులతో విభేదాలు. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. ప్రముఖులతో ముఖ్య విషయాలు గ్రహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. కొన్ని కాంట్రాక్టులను చేజిక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో అధిక లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది, మంచి పేరు గడిస్తారు. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామధ్యానం మంచిది.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. శుభకార్యాల నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరం చేస్తారు. అనుకోని విధంగా  కాంట్రాక్టులు పొందుతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు  మరింత మెరుగుపడతాయి. కొన్ని సమస్యలు తీరి ఊర ట లభిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. మహాలక్ష్మీ అష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారి రుణాలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని  చేజారతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. ఇంటిæ నిర్మాణాలలో అవాంతరాలు. చేపట్టిన పనులు మధ్యలోనే ముగిస్తారు.  బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొత్త సమస్యలు  ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగి సవాలుగా మారవచ్చు.  కళారంగం వారికి  సామాన్యంగా ఉంటుంది. వారం  మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఊహించని ఆహ్వానాలు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలలితాదేవీ స్తుతి మంచిది.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. రుణాలు తీరతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. కోర్టు వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో  ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కే సూచనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమహావిష్ణు షోడశనామ స్తుతి మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. కాంట్రాక్టర్ల యత్నాలలో కదలికలు ఉంటాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఒక సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం, ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు సానుకూలం.  శ్రీసూర్యాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కొత్త వ్యక్తుల  పరిచయాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ప్రత్యర్థులు సైతం మీపై ప్రేమాభిమానాలు చూపుతారు. పరిస్థితులు మరింతగా అనుకూలిస్తాయి. అందరిలోనూ మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చే సే వీలుంది. కోర్టు కేసుల నుంచి విముక్తి పొందుతారు. దూరపు బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు నెరవేరే సమయం. వారం చివరిలో  బంధువిరోధాలు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకోని విద్యావకాశాలు విద్యార్థులకు ఊరటనిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో  వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. వ్యాపారాలలో మరింత ప్రగతి ఉంటుంది. భాగస్వాముల చేయూత లభిస్తుంది.  ఉద్యోగాలలో అనుకోనిæ పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ ధ్యానం మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
బంధువులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తి చేస్తారు. గృహ, వాహన యోగాలు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వíß స్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. ధనవ్యయం. వ్యవహారాలలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థికంగా మరింత అనుకూల పరిస్థితి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు సమకూరతాయి. ఎటువంటి వ్యవహారమైనా  పట్టుదలతో పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలను అంతా సమర్థిస్తారు.  చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నిలిచిన ప్రమోషన్లు దక్కవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభించే సూచనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంటాబయటా మరింత ప్రోత్సాహం.  కొత్త వ్యక్తుల పరిచయాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. అనుకున్న పనులు కొంత కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు.  వ్యాపారాలలో  నూతనోత్సాహం. ఉద్యోగాలలో పనిభారం నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ తప్పదు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రం పఠించండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు