ఈ రాశి వారికి వారంలో శ్రమించినా ఫలితం కనిపించదు

4 Apr, 2021 06:29 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. ఆప్తుల సలహాలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అతి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు అనివార్యం. రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో చికాకులు. పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరాజరాజేశ్వరి స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు మరింత లభిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో అంది అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్నింటి నుంచి బయటపడతారు. సోదరులు, మిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది.  వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.  అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. ఎరుపు, బంగారు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ, వాహనయోగాలు. కుటుంబంలో శుభకార్యాలపై ప్రస్తావిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. కోర్టు వ్యవహారంలో కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు.  వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని వ్యవహారాలలో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి  ఆశాజనకంగా ఉంటాయి. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు.  వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగాలలో ఆటుపోట్లు, సమస్యలు తీరతాయి. సంతోషకరమైన వార్తలు అందుతాయి. రాజకీయవర్గాలకు అంచనాలు నిజమయ్యే సమయం.  వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులు సమయానికి చకచకా సాగుతాయి. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత  బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పసుపు, గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. కొన్ని పనులు కొంత జాప్యమైనా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని నిర్ణయాలు పునఃపరిశీలించుకుంటారు. స్థిరాస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. కళారంగం వారికి కార్యసిద్ధి. వారం ప్రారంభంలో వాహనయోగం. వస్తులాభాలు. నేరేడు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు.  ఇంటాబయటా ఒత్తిడులు కొంత తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బాధ్యతలు మరింతగా  సమర్థవంతంగా నిర్వహిస్తారు.  కొన్ని పనులు నిదానంగా పూర్తిచేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు.  శ్రమించినా ఫలితం కనిపించదు. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  ఒక సమాచారం కొంత ఊరట కలిగించవచ్చు. నిరుద్యోగులకు నిరాశ తప్పకపోవచ్చు. స్థిరాస్తుల వివాదాలు నెలకొని సవాలుగా మారవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉండి స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు వి«ధులు ఇబ్బందిగా మారవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీ కార్యదక్షత, సమర్థతను నిరూపించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఊహించిన  లాభాలు రాగలవు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చ్రివరిలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. మానసిక అశాంతి. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అప్రయత్న కార్యసిద్ధి. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకున్న ప్రయత్నాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఈతిబాధలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. నీలం, నేరేడు రంగులు. లింగాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఎటువంటి వ్యవహారమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూవివాదాలు కొలిక్కి తెస్తారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహాది శుభకార్యాలపై సంప్రదింపులు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. మానసిక అశాంతి. ఒప్పందాలలో ఆటంకాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు

మరిన్ని వార్తలు