ఈ రాశి రాజకీయవేత్తలకు అంచనాలు నిజమవుతాయి

21 Feb, 2021 07:09 IST|Sakshi

మేషం
చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ వృథా కాగలదు. సహాయం పొందిన వారే సమస్యలు సృష్టించవచ్చు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

వృషభం
అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఇంటాబయటా ఎదురుండదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చిరకాల కోరిక ఒకటి  నెరవేరుతుంది. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. వారం చివరిలో  వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

మిథునం
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాల సందర్శనం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని  చిక్కుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో భూవివాదాలు. మానసిక అశాంతి. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి. 

కర్కాటకం
ఓర్పుతో కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కరించుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు విశేష లాభదాయకమైన సమయం. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. పసుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

సింహం
బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. విద్యార్థుల జీవితాశయం నెరవేరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సమయం. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. గత సంఘటనలు కొన్ని  గుర్తుకు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో  ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

కన్య
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఇంటిలో సంతోషదాయకంగా ఉంటుంది.  ఆప్తుల నుంచి ధనలాభం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేర్పు, ఓర్పుతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.  వ్యాపారాల విస్తరణపై దృష్టి పెడతారు. ఉద్యోగాలలో సమర్థత చాటుకుంటారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి.  ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. సన్నిహితులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల
దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన  పనులు చకచకా సాగుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రాజకీయవేత్తలకు వ్యూహాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
బంధువులు, మిత్రులతో మరింత  ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సమయానికి పూర్తి చేస్తారు. ఊహించని ఆహ్వానం అందుతుంది. స్థిరాస్తి వృద్ధి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది.  అందరిలోనూ మీ ప్రతిభ,  సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవర్గాలకు కొన్ని చికాకులు తొలగుతాయి. వారం చివరిలో  అనుకోని  ఖర్చులు. సోదరులతో కలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. బంధువుల నుంచి  ఆస్తిలాభం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు సమకూరి  విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.  వారం  ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మకరం
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి  మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. స్థిరాస్తి వృద్ధి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం.  ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యాపారాలు  లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో  చిక్కులు, సమస్యలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆశలు ఫలిస్తాయి.  వారం ప్రారంభంలో అనారోగ్యం. సోదరులతో కలహాలు. నేరేడు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. 

కుంభం
దూరపు బంధువుల నుంచి ఊహించని ఆహ్వానాలు. వ్యవహారాలలో  విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు. వాహనయోగం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

మీనం
అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సహాయం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు.  కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు ఎట్టకేలకు సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. బంధువులతో వివాదాలు. గులాబీ, ఎరుపు రంగులు. గణేశాష్టకం పఠించండి. 

మరిన్ని వార్తలు