ఈ వారంలో ఈ రాశి వారికి పాతబాకీలు వసూలవుతాయి

28 Feb, 2021 06:35 IST|Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలపై నిర్ణయాలు.  వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని  బాకీలు వసూలవుతాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు. రాజకీయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.. వారం ప్రారంభంలో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.


వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని వేడుకలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలు లభిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. నిర్ణయాలలో మార్పులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు పెట్టుబడులు పెరిగి  పురోగతిలో సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతపోస్టులు లభించవచ్చు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు.  వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. చికాకులు. పసుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధన చేయండి.


కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత చికాకు పెట్టవచ్చు. విద్యార్థులకు  శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా  ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. కళారంగం వారికి ఒత్తిడులు తప్పవు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి.  కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు.  వారం చివరిలో బంధువులతో వివాదాలు. అనారోగ్య సూచనలు. పసుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలపై చర్చలు సఫలం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకునే అవకాశం. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనసౌఖ్యం. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో  స్వల్ప అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  గణేశాష్టకం పఠించండి. 

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో మరింత ఆదరణ పొందుతారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆలయాలు సందర్శిస్తారు.  కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి, పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో  ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. వృథా ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం.  శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక విషయాలలో మరింత పురోగతి కనిపిస్తుంది.  విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్యవిషయాలు తెలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త భాగస్వాముల సహాయంతో వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. కళారంగం వారికి యోగదాయకంగా ఉంటుంది.  వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో మరింత ఒత్తిడులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు నూతనోత్సాహం. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు.  వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి.  వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఊహించిన కంటే అధికంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కళారంగం వారికి అనుకోని సంఘటనలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో బంధువులతో మాటపట్టింపులు. మానసిక అశాంతి. ధనవ్యయం. పసుపు, నీలం రంగులు.  దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సంఘంలో మీపై మరింత గౌరవం పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. విద్యార్థులకు అవకాశాలు అందివస్తాయి. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా గడుపుతారు. రాజకీయవర్గాలకు పదవీయోగం.  వారం చివరిలో అనుకోని ఖర్చులు. కుటుంబబాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.

మరిన్ని వార్తలు