ఈ వారంలో ఈ రాశివారు వాహనాలు కొనుగోలు చేస్తారు

24 Jan, 2021 06:46 IST|Sakshi

మేషం:
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల విషయంలో ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం.  ఆరోగ్యపరంగా చికాకులు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారాలు కొంత నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. కళారంగం వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు,  ధనలబ్ధి. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతను పూజించండి.

వృషభం:
ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. ఊహించని ధనలాభాలు ఉండవచ్చు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, శ్రేయోభిలాషులతో ఉత్తరప్రత్యుత్తరాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, గోధుమ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మిథునం:
ముఖ్యమైన పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఉత్సాహంగా ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలకు అన్నీ విజయాలే. వారం ప్రారంభంలో స్వల్ప ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు.  ఆకుపచ్చ, ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం:
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు పోటీపరీక్షల్లో  విజయం. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందాన్ని పంచుకుంటారు. వ్యాపారాలలో ఆటంకాలు తొలగి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. తెలుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ æ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం:
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరమైన వ్యక్తులు దగ్గరవుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, అనుకోని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఈతిబాధలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పిలుపు అందుతుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు.  తెలుపు, లేత నీలం రంగులు, పశ్చిమæదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య:
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి సహాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.  వివాహయత్నాలు అనుకూలిస్తాయి.  నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. రాజకీయవర్గాలకు అంచనాలు నిజం కాగలవు.  వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

తుల:
కొన్ని వ్యవహారాలు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యసమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. సోదరుల నుంచి సమస్యలు. పసుపు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేసుకోండి.

వృశ్చికం:
చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆప్తులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. సంఘంలో మీపై మరింత ప్రేమ పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలలో అవాంతరాలు తొలగి  ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గౌరవం లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా కలసివచ్చే కాలం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ పూజలు చేయండి.

ధనుస్సు:
ప్రారంభంలో స్వల్పæ చికాకులు నెలకొంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు.  సోదరులు, మిత్రులతో వివాదాలు  సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలం. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సైతం సహాయపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, భాగస్వాములు సహకరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేత నీలంరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

మకరం:
ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు సానుకూలం. గృహ  నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో దుబారా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. నీలం, చాక్లెట్‌ రంగులు, తూర్పుæ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కుంభం:
ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతవరకూ సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, బాధ్యతలు కొంత తగ్గి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. ప్రజాదరణ పెరుగుతుంది. వారం మధ్యలో మానసిక చికాకులు. ధనవ్యయం. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మీనం:
వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకున్న లక్ష్యాలు సా«ధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహయత్నాలు సానుకూలమవుతాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు.  ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత పురోగతి కనిపిస్తుంది. వారం చివరిలో బంధుగణంతో వివాదాలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

>
మరిన్ని వార్తలు