ఈ వారంలో ఈ రాశి రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది

31 Jan, 2021 06:32 IST|Sakshi

మేషం: ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉన్నా అవసరాలకు సొమ్ము సమకూరుతుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శనాలు అధికంగా చేస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. ఒక వివాదం నుంచి గట్టెక్కి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో  విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రయత్నాలు సఫలం కాగలవు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృషభం: ముఖ్యమైన పనులు చకచకా పూర్తి కాగలవు. సమాజంలో మీపట్ల ఆదరాభిమానాలు పెరుగుతాయి. రావలసిన  సొమ్ము  సమయానికి అందుకుంటారు. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి లాభాలు అందుతాయి.  ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలించే సూచనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. ఇంటిలో ఒత్తిడులు. బంగారు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మిథునం: ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ విశేష గౌరవం లభిస్తుంది. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు లభిస్తాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు శుభవర్తమానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి  చేస్తారు. శ్రమపడ్డా ఫలితం అంతగా కనిపించదు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. నిర్ణయాలలో తొందరపాటు తగదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి.  గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు మరింత పెరుగుతాయి. కళారంగం వారికి నిరాశ. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం:వీరికి పట్టింది బంగారమే. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాటసాయం అందుతుంది. అతిముఖ్యమైన పనులలో విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవర్గాలకు విజయాలు వరిస్తాయి. వారం చివరిలో బంధువులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

కన్య: కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.  సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. భూవివాదాలు కొంతమేర పరిష్కారమవుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. గృహ నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది.  వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, బంగారు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

తుల: అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం  మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. అందరిలోనూ  గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆశయాలు సిద్ధిస్తాయి. వ్యాపారాలు మరింత  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కే సూచనలు. కళారంగం వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. నేరేడు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

వృశ్చికం: ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో మరింత మెరుగుదల కనిపిస్తుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి.  సన్నిహితులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.  ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, గులాబీ రంగులు.పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు అధిగమించి పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రావలసిన బాకీలు అంది అవసరాలు తీరతాయి. విద్యార్థులు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. మీ నిర్ణయాలు అందరూ ఆమోదిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన  లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు మరింత పెరుగుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. సోదరుల నుంచి ఒత్తిడులు  తప్పవు. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి. 

మకరం: ఆర్ధిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సూచనలు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం ఉండవచ్చు. కుటుంబసమస్యల  నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. కొన్ని అంచనాలు నిజం చేసుకుంటారు.  వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి.  ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.. 

కుంభం: ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. బంధువుల నుంచి ఒత్తిడులు తప్పవు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం: కొత్త పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుకుంటారు. ముఖ్యమైన  పనులలో విజయం సాధిస్తారు. ఆలోచనలు మరింత కలసివస్తాయి. విద్యార్థులకు సమస్యలు తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో చిక్కులు, సమస్యలు తీరతాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో అనుకోని బాధ్యతలు చేపడతారు.  రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి.  వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మరిన్ని వార్తలు