ఈ రాశివారికి వారం చివరిలో  శుభవార్తలు

28 Mar, 2021 06:59 IST|Sakshi

మేషం: ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.  విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు వివాదాలు తీరి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు అనుకూల సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: పనులు సజావుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కొన్ని  ఆశయాలు నెరవేరతాయి. బంధువర్గంతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆలోచనలు అమలులో అవాంతరాలు తొలగుతాయి. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో  మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులు అనుకున్న కోర్సులలో ప్రవేశిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో రుణఒత్తిడులు. బంధువులతో విభేదాలు. గులాబీ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం: కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు.  వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు మరింత పెరుగుతాయి.  వారం చివరిలో  శుభవార్తలు. వాహనయోగం. కొత్త పరిచయాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

కర్కాటకం: కొన్ని పనులు హఠాత్తుగా వాయిదా పడతాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఇంటి నిర్మాణయత్నాలలో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటాబయటా సమస్యలు అధిగమవుతాయి. సోదరులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు. పెట్టుబడుల్లో ఆటంకాలు. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. కళారంగం వారి యత్నాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

సింహం: ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న  వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగ విధుల్లో  అవరోధాలు అధిగమిస్తారు. రాజకీయవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం.  స్వల్ప అనారోగ్యం. మానసిక అశాంతి. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కన్య: ముఖ్యమైన పనులు సజావుగా సకాలంలో  పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి  ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, భూములు కొంటారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. కళారంగం వారికి గౌరవ పురస్కారాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. మిత్రులతో వివాదాలు నెలకొనే అవకాశం. నిర్ణయాలలో మరింత  నిదానం అవసరం. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు.  కళారంగం వారికి శ్రమ మరింత పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. దూరపు బంధువుల కలయిక. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి రుణబాధల నుంచి విముక్తి. కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో  ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మునుపటి కంటే పుంజుకుంటాయి.  ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

ధనుస్సు: ఈ వారం పట్టింది బంగారమే. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. సన్నిహితులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు కనిపిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పనిభారం తగ్గుతుంది. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి.  వారం చివరిలో  అనుకోని ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. మానసిక అశాంతి. పసుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం: కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణబాధలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. గృహ, వాహనయోగాలు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు అందే అవకాశం. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. ఇంటాబయటా చికాకులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కుంభం:
ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి. పారిశ్రామికవర్గాలకు వివాదాలు నెలకొంటాయి. వారం చివరిలో విందువినోదాలు. కార్యజయం. వాహనయోగం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మీనం:
ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం. ఏ పని చేపట్టినా ముందుకు సాగక డీలా పడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు నెలకొని సవాలుగా మారవచ్చు. భూములకు సంబంధించిన ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహమే. అనుకోని మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం ప్రారంభంలో బంధువుల ద్వారా శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరాజరాజేశ్వరి అష్టకం పఠించండి.

మరిన్ని వార్తలు