నూతన ఒరవడిలో అంగన్‌వాడీలు

22 Mar, 2023 02:28 IST|Sakshi
చీరాల మండలం దంతంపేట అంగన్‌వాడీ కేంద్రంలో విద్యను బోధిస్తున్న అంగన్‌వాడీ

బాపట్లఅర్బన్‌: అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ లో వినూత్న మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. గతంలో కేవలం ఆరో గ్య పౌష్టికాహార కేంద్రాలుగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునికరించి ప్రీస్కూల్‌ కిట్లతో విద్యార్థులకు అక్షరాలను నేర్పిస్తున్నారు. ప్రాథమిక విద్యకు చిన్నారులను సిద్ధం చేసేలా కేంద్రాలను సుందరంగా ముస్తాబు చేస్తుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పోష్టికాహారాన్ని అందించడంతోపాటు, పిల్లలకు మెరుగైన విద్యాబుద్ధులు నేర్పేందుకు ప్రీస్కూలు ఏర్పాటు చేసింది. నాడు–నేడు ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా నిధులు కేటాయిస్తోంది. ప్రీస్కూల్లో సదుపాయాలను ఏర్పాటు చేయడంతోపాటు ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా అంగన్‌వాడీ టీచర్లను తీర్చిదిద్ది వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. శిక్షణ పొందిన అంగన్‌వాడీ టీచ ర్లు నూతన మెళకువలతో, ఆట పాటల ద్వారా ప్రీస్కూలులో చిన్నారులను తీర్చిదిద్దుతున్నారు.

1,888 కేంద్రాల్లో ప్రత్యేక సిలబస్‌

బాపట్ల జిల్లాలో 25 మండలాల్లో 1,888 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 19,927 మంది ఉన్నారు. సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ ప్రీస్కూలు కోసం ప్రత్యేక ప్రణాళికలు నూతన సిలబస్‌ రూపొందించింది. ఈ మేరకు అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం నాణ్యమైన, ప్రీస్కూలు కిట్లను అందించింది. వీటితో టీచర్లు సొంతంగా బొమ్మను తయారుచేసి చిన్నారులకు అనుకూలంగా ఇష్టపడేలా విద్యా బోధన చేస్తున్నారు. వివిధ రకాల బొమ్మలు చిన్నారులకు చూపించి పాఠాలు బోధించడం వల్ల వారు ఆసక్తిగా నేర్చుకొని సులభంగా అర్థం చేసుకుంటున్నారు. ఫలితంగా పిల్లల అభ్యసనకు అలవాటు పడి ఆసక్తి చూపడంతోపాటు చిన్న వయసులోనే విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు.

ఆంగ్ల మాధ్యమంలో బోధన

ప్రభుత్వ ప్రీ ప్రైమరీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలుగా తీర్చిదిద్దింది. ఈ మేరకు టీచర్లకు అవసరమైన ప్రత్యేక శిక్షణ సైతం అందిస్తుంది. శిక్షణ పొందిన టీచర్లు ఆంగ్లంపై చిన్నారులకు ఆసక్తి కలిగేలా విద్యా బోధన చేస్తూ వారిని ప్రేరేపిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమాల్లో భాగంగా బొమ్మల తయారీకి అవసరమైన చార్టులు రంగు ఫెన్సిల్స్‌, స్కెచ్‌లు, రబ్బర్లు తదితర సామగ్రిని ప్రభుత్వం కేంద్రాలకు సమకూర్చింది. వీటి వినియోగంపై సూపర్‌వైజర్లకు ఇప్పటికే సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. సమయానుకూలంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు మెరుగైన విద్యా బోధన అందించేందుకు అవసరమైన శిక్షణ అందించడంతోపాటు వారికి అవసరమైన ప్రత్యేక యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

ఆంగ్ల మాధ్యమంలో

ప్రీ స్కూళ్ల ఏర్పాటు

ఆటపాటలతో కూడిన విద్య

బొమ్మలతో అర్థమయ్యే రీతిలో

విద్యా బోధన

బాపట్ల జిల్లాలో 1,888

అంగన్‌వాడీ స్కూళ్లు

కిట్లతో బోధన

అంగన్‌వాడీ కేంద్రాల ను ప్రీస్కూల్‌గా మా ర్చడం వల్ల పిల్లల కు చాలా ప్రయోజనం. టీచర్లు కిట్లతో చిన్నా రులకు బోధిస్తున్నారు. కిట్ల ద్వారా బోధన ప్రారంభమైన తర్వాత కేంద్రాలకు చిన్నారుల రాక పెరిగింది. వారిని ఆకర్షించి వారికి అర్థమయ్యేలా బోధన చేసేందుకు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వంసదుపాయాలను కూడా కల్పిస్తుంది. భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయి.

– కె.ఉమాదేవి,

సీడీపీఓ, బాపట్ల జిల్లా

>
మరిన్ని వార్తలు