భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం

24 Mar, 2023 06:18 IST|Sakshi

మార్టూరు: జాతీయ రహదారిపై బొల్లాపల్లి టోల్‌ ప్లాజ్‌ వద్ద గురువారం తెల్లవారు జామున మార్టూరు పోలీసులు భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీ యం సమాచారం మేరకు.. రోజు వారీ తనిఖీలో భాగంగా పోళీసులు టోల్‌ప్లాజా వద్ద నిఘా ఉంచగా విశాఖపట్నం నుంచి కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు వెళ్తున్న లారీని అధికారు లు ఆపి తనిఖీ చేశారు. జిప్సం అడుగున ఉన్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. అధికారులు స్వాధీనం చేసు కున్న గంజాయి సుమారు 180 కేజీలు ఉన్నట్లు అంచనా. నిందితులను నేడో రేపో అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని సమాచారం.

నెలాఖరులోపు పెండింగ్‌ పనులు పూర్తిచేయాలి

జిల్లా వ్యవసాయాధికారి అబ్దుల్‌ సత్తార్‌

మార్టూరు: ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీలోపు పూర్తవుతున్నందున వ్యవసాయ సిబ్బంది రైతులకు సంబంధించిన పెండింగ్‌ పనులు పూర్తి చేయాలని బాపట్ల జిల్లా వ్యవసాయాధికారి షేక్‌ అబ్దుల్‌ సత్తార్‌ అన్నా రు. స్థానిక వ్యవసాయ మార్కె ట్‌ యార్డులో మార్టూరు సబ్‌ డివిజన్‌ స్థాయి అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం కిసాన్‌ పథకంలో ఈ–కేవైసీ నెలాఖరులోగా పూర్తి చే యాలన్నారు. లేకుంటే రైతుకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరవని తెలిపా రు. శనగ పంటను ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయడం కోసం పంటల నమోదును ఆర్బీకే సిబ్బంది పూర్తి చేయా లని అన్నారు. పెండింగ్‌ గ్రూపులు పూర్తి చేసి వెంటనే గ్రౌండింగ్‌ చేయాలన్నా రు. ఏడీఏ శ్రీనివాసరావు ఉన్నారు.

మరిన్ని వార్తలు