విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు

24 Mar, 2023 06:18 IST|Sakshi

కారంచేడు: గ్రామ సచివాలయాల సిబ్బంది తమ విధుల పట్ల బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని, అలాంటి వారిపై తగు చర్యలు తప్పవని జిల్లా సహకార శాఖాధికారి కేవీ రామారావు హెచ్చరించారు. మండలంలోని కుంకలమర్రు గ్రామ సచివాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో సిబ్బంది ఎంత మంది ఉన్నారో, వారి విధులు అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండవద్దన్నారు. వచ్చిన అర్జీలను వెంటనే విచారణ చేసి పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే విధిగా ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను తెలియజేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటూ, వైద్యశాఖతో సమన్వయంగా పనిచేస్తూ రక్తహీనతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా సహకార శాఖాధికారి రామారావు

మరిన్ని వార్తలు