31న పర్చూరులో మెగా జాబ్‌మేళా

24 Mar, 2023 06:18 IST|Sakshi
పోస్టర్‌ విడుదల చేసిన జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌

బాపట్ల: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పన, సీడాప్‌ ఆధ్వర్యంలో ఈనెల 31వతేదీన నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ పేర్కొన్నారు. ఈమేరకు జాబ్‌మేళా పోస్టర్లను గురువారం విడుదల చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పర్చూరు బీఏఆర్‌ అండ్‌ టీఏ జూనియర్‌ కళాశాలలో ఈ జాబ్‌ మేళా ఉంటుందని, నిరుద్యోగులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 6302764962, 7989697996 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. జేసీ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, జిల్లా ప్లేస్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డి.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

28 నుంచి ‘అమ్మ’ శత జయంతి ఉత్సవాలు

విజయవాడ కల్చరల్‌: బాపట్ల జిల్లా జిల్లెళ్లమూడి అమ్మ శత జయంతి ఉత్సవాలను ఈనెల 28 నుంచి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్లు విశ్వజననీ పరిషత్‌ మేనేజింగ్‌ ట్రస్టీ పి. గిరిధర్‌కుమార్‌ తెలిపారు. విజయవాడలోని కౌతా పూర్ణానందం విలాస్‌లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ అమ్మ శాంతి సందేశం సమస్త మానవాళికి వినిపించడానికి ట్రస్ట్‌ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐదురోజులపాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని బాపట్ల శాసన సభ్యులు కొన రఘుపతి ప్రారంభించి, శతజయంతి విశిష్ట సంచిక ఆవిష్కరిస్తారన్నారు. ప్రచార కమిటీ కార్యదర్శి మల్లాప్రగడ శ్రీమన్నారయణ మూర్తి మాట్లాడుతూ సిద్ధేశ్వరానంద భారతి, విశ్వయోగి విశ్వంజీ, కమలానంద భారతి, సీతారామ గురుదేవులు, వాసుదేవానంద గిరి స్వామీజీల అనుగ్రహ భాషణ ఉంటుందన్నారు. ప్రతి రోజూ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు.

ఉర్దూ పాఠశాలల పనివేళల్లో మార్పులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: రంజాన్‌ మాసం సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉర్దూ మీడియంలో నడుస్తున్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు ఉర్దూ మీడియం డైట్‌ కళాశాలలు శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 22వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రంజాన్‌ మాసంలో ఉపవాసాన్ని ఆచరిస్తూ, ప్రార్థనల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని వివిధ ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తులతో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవడంపై మైనార్టీ ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

త్రికరణ శుద్ధిగా...

పోపు డబ్బాలో దాచి చెల్లించిన సొత్తు మళ్లీ ఇంటికి చేరింది. కూలీనాలీ చేసుకుని పోగేసి కట్టిన చెమట కష్టం అరచేతిలో మెరిసింది. డ్వాక్రా రుణాలపై వడ్డీలు చెల్లిస్తున్న జగన్‌మోహనుడి రూపం ప్రతి అక్కాచెల్లెమ్మల గుండెల్లో పచ్చ బొట్టయి మెరుస్తోంది. ఇప్పటికే రెండు విడతల నగదు ఆడబిడ్డలకు అండగా నిలవగా .. మూడో విడత లబ్ధిదారుల జాబితా సచివాలయాల్లో ప్రజల ముందు నిలిచింది. 25వ తేదీన వైఎస్సార్‌ ఆసరా అక్కాచెల్లెమ్మల కొంగులోకి చేరి మాట తప్పని జగనన్నను నిండు మనసుతో ఆశీర్వదించ నుంది.

– బాపట్ల అర్బన్‌

పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డ్వాక్రా సంఘాల అప్పులను దశలవారీగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు 2019 ఏప్రిల్‌ 11 నాటికి ఎంత అయితే అప్పు మిగిలి ఉంటుందో వాటిని ఆసరా పథకం ద్వారా నాలుగు విడతలుగా ఆయా సంఘాలకు చెల్లించేందుకు నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీ సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. తాజాగా మూడో విడత నిధులు విడుదలకు శ్రీకారం చుట్టారు.

జిల్లాలో ఇలా..

బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లో 25 మండలాలు ఉన్నాయి. తొలి దశలో 27,643 సంఘాలకు రూ. 236.76 కోట్లు, రెండో దశలో రూ.239.98 కోట్లు అక్కచెల్లెమ్మలకు అందించారు. ప్రస్తుతం మూడో విడతకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు రూ.238.31 కోట్లకుపైగా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ తెలిపారు. అయితే సంఘాల తీర్మానంతో సభ్యుల ఖాతాకు బ్యాంకర్లు జమ చేసే అవకాశం ఉంది. పలు సంఘాల లీడర్లు మొదటి విడత రెండో విడత ఆసరా నిధులు బ్యాంకు నుంచి నేరుగా తీసుకున్నారు. అర్హుల జాబితా రూపకల్పనలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సచివాలయాల వద్ద జాబితాలను అందుబాటులో ఉంచారు. సభ్యులు మరణిస్తే నామినీలకు సదరు సొమ్మను జమ చేస్తారు.

మొదటి, రెండో విడతల్లో లబ్ధి పొందిన సంఘాలు వివరాలు (రూ.కోట్లల్లో)

● రేపల్లె నియోజకవర్గంలో 2020–21 కి 4,893 సంఘాలకు మొదటి విడత రూ.43.08 కోట్లు, 2021–22 రెండో విడత రూ.43.53 కోట్లు లబ్ధి పొందారు

● వేమూరు నియోజకవర్గంలో 2020–21కి 5,173 సంఘాలకు మొదటి విడత రూ.46.48 కోట్లు 2021–22 రెండో విడత రూ. 48.22 కోట్లు లబ్ధి చేకూరింది.

● బాపట్ల నియోజకవర్గంలో 2020–21కి 3,554 సంఘాలకు మొదటి విడత రూ. 42.11 కోట్లు 2021–22 రెండో విడత రూ. 42.40 కోట్లు లబ్ధి పొందారు.

● చీరాల నియోజకవర్గంలో 2020–21కి 2,872 సంఘాలకు మొదటి విడత రూ.21.96 కోట్లు, 2021–22 రెండో విడత రూ. 22.12కోట్లు లబ్ధి పొందారు.

● పర్చూరు నియోజకవర్గంలో 2020–21కి 5,877 సంఘాలకు మొదటి విడత రూ. 50.62 కోట్లు, 2021–22 రెండో విడత రూ.51.13కోట్లు లబ్ధి పొందారు.

● అద్దంకి నియోజకవర్గంలో 2020–21 కి 5,274 సంఘాలకు మొదటి విడత రూ. 42.11 కోట్లు, 2021–2022 రెండో విడత కే, 42.40 కోట్లు లబ్ధి పొందారు

జగన్మాతకు పుష్పాభిషేకం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం దుర్గమ్మకు ఎర్రగులాబీలు, కనకాంబరాలతో అర్చన చేశారు. లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద ప్రతిష్టించిన దుర్గమ్మ ఉత్సవ మూర్తికి ఈ పుష్పాలతో అర్చన నిర్వహించారు. అమ్మవారికి జరుగుతున్న విశేష పుష్పార్చనను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వేదిక వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా భక్తులకు ఆశీర్వచనం అందజేసిన అర్చకులు వారికి పుష్పాలను బహూకరించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌ విజయవాడ

విద్యార్థులపై మాల్‌ ప్రాక్టీసు కేసులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: జేబులో స్లిప్పులు పెట్టుకుని ఇంటర్‌ పరీక్షలు రాసేందుకు వచ్చిన ఐదుగురు విద్యార్థులపై అధికారులు మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదు చేశారు. గురువారం జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు మ్యాథ్స్‌ 1బీ, జువాలజీ, హిస్టరీ పేపర్‌–1 పరీక్షలు జరిగాయి. గుంటూరు అమరావతిరోడ్డులోని నారాయణ జూనియర్‌ కళాశాలలో మ్యాథ్స్‌ 1బీ పరీక్ష రాస్తూ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులతో పాటు గోరంట్లలోని శ్రీచైతన్య, చిలకలూరిపేటలోని ఏఎంజీ జూనియర్‌ కళాశాలల్లో మరో ఇద్దరిని చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఇన్విజిలేటర్లు గుర్తించారు. కాపీయింగ్‌కు పాల్పడుతున్న వీరిపై మాల్‌ ప్రాక్టీసు కేసులు నమోదు చేసిన అధికారులు పరీక్షల నుంచి డీబార్‌ చేశారు. గురువారం జరిగిన పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 134 కేంద్రాల పరిధిలో కేటాయించిన 46,763 మంది విద్యార్థుల్లో 45,614 మంది హాజరయ్యారు. 84 పరీక్ష కేంద్రాల్లో అధికారులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ విస్తృత తనిఖీలు నిర్వహించారు.

పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌..

మార్కెట్‌ సెంటర్లోని హిందూ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థులను ప్రతిరోజూ క్షుణ్ణంగా తనిఖీ చేసి, కేంద్రాల్లోకి అనుమతించాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌ఐఓ జి. సునీత, చీఫ్‌ సూపరింటెండెంట్‌ వెంకట రాము, డీఓ రత్నశేఖర్‌ ఉన్నారు.

బడి పిల్లల డ్రాపవుట్స్‌ తగ్గాయి..

గుంటూరు వెస్ట్‌: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బడి పిల్లల డ్రాప్‌ అవుట్లు తగ్గుముఖం పట్టాయని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి నిర్వహించిన వీడియో సమావేశానికి స్థానిక కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు.

బాపట్లటౌన్‌: క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తే ఊపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో గురువారం బెట్టింగ్‌లకు సంబంధించి పోస్టర్‌ ఆవిష్కరించి, విలేకరులతో మాట్లాడారు. సరదాగా మొదలుపెట్టి ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌లకు యువత బానిసలవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆన్‌లైన్‌ గేమ్స్‌, క్రికెట్‌ బెట్టింగ్‌లపై నిషేధం విధించారన్నారు. ఒకసారి ఆడిచూద్దాం అని సరదాగా మొదలుపెట్టి వీటి బారిన పడిన యువకులు బయటికి రావడమనేది కష్టతరమైన విషయం అన్నారు. ఈ బెట్టింగ్స్‌ కి అలవాటు పడ్డ వాళ్లు అప్పుల పాలు కావడమే కాకుండా.. చేసిన అప్పులు తీర్చలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల్లో క్రికెట్‌కు ఉన్న మక్కువను ఆసరాగా తీసుకొని క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠాలు ఐపీఎల్‌ సీజన్‌ను ఎలాగైనా క్యాష్‌ చేసుకోడానికి సిద్ధంగా ఉంటాయన్నారు. అందుకే దీనిపై పూర్తి స్థాయిలో దృష్టిసారిస్తున్నామన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లను అరికట్టేందుకు ముందుగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజలు ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలన్నారు.

రేపు ఆసరా మూడో విడత నిధులు విడుదల

సచివాలయాల్లో ఇప్పటికే అర్హుల జాబితా జిల్లాలో మూడోవిడత రూ.238.31 కోట్లు కేటాయింపు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్న డ్వాక్రా మహిళలు

స్లిప్పులతో వచ్చిన ఐదుగురు ఇంటర్‌ విద్యార్థులు డీబార్‌ గుంటూరులో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌

క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తే ఉపేక్షించం

జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌

రంజాన్‌ మాసం దృష్ట్యా

మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం

మూడో విడతలో లబ్ధి పొందే

సంఘాల వివరాలు ఇలా...

నియోజక వర్గం సంఘాలు రూ. కోట్లు

అద్దంకి 5,272 42.25

బాపట్ల 3,452 32.51

చీరాల 2,872 22.04

పర్చూరు 5,975 50.88

రేపల్లె 4,890 43.30

వేమూరు 5,169 47.34

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా అమలు

డ్వాక్రా సంఘాల్లో సభ్యులై 2019 ఎన్నికల నాటికి రుణం ఉన్న సభ్యులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వైఎస్సార్‌ ఆసరా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం. మూడో విడతకు జాబితాలు సిద్ధం చేశాం. సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శనగా ఉంచాం. లబ్ధిదారులు జాబితాలను పరిశీలించుకొని సమస్యను తెలియజేస్తే పరిష్కరించేలా ఆదేశాలు ఇచ్చాం.

– అర్జున్‌రావు, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌,

డీఆర్డీఏ, బాపట్ల జిల్లా

మరిన్ని వార్తలు