పదిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి

25 Mar, 2023 02:08 IST|Sakshi
మాట్లాడుతున్న జెడ్పీ సీఈఓ మోహన్‌రావు

చెరుకుపల్లి: పది పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల్లో చదువుకునే విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జెడ్పీ సీఈఓ కె.మోహన్‌రావు సూచించారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను సీఈఓ శుక్రవారం సందర్శించారు. తొలుత పాఠశాలలో అమలవుతున్న జగనన్న గోరుముద్ద మెనూ ప్రకారం సక్రమంగా అమలు జరుగుతుందా లేదా అని విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి తొలి మెట్టు అని అది అధికమిస్తే జీవిత ప్రస్థానం సక్రమంగా ప్రారంభమవుతుందన్నారు. విద్యార్థులు పాఠశాల్లో ఉదయం సాయంత్రం నిర్వహించే ప్రత్యేక తరగతులను సక్రమంగా సద్వినియోగం చేసుకుని పరీక్షకు సన్నద్ధం కావాలన్నారు. పరీక్ష సమయంలో ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి పరీక్ష సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. తరువాత పాఠశాలలో రికార్డులు పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని ఘన వ్యర్థాల నిర్వహణ సంపద కేంద్రాన్ని సందర్శించి గ్రీన్‌ అంబాసిడర్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, పాఠశాల హెచ్‌ఎం కె.శైలజ, ఈఓపీఆర్డీ మురళీ పంచాయతీ కార్యదర్శి ఈవూరి విజయ్‌బాబు పాల్గొన్నారు.

జెడ్పీ సీఈఓ మోహన్‌రావు

మరిన్ని వార్తలు