ఆదాయ వనరులు పెంచుకోవాలి

25 Mar, 2023 02:08 IST|Sakshi
శిక్షణ కేంద్రంలో మాట్లాడుతున్న డీపీఓ శంకర్‌నాయక్‌

కర్లపాలెం: జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామ పంచాయతీలలో వికేంద్రీకృత ఘన వ్యర్థాలను విక్రయించటం ద్వారా ఆదాయం పెంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి వై.శంకర్‌నాయక్‌ తెలిపారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెంలోని శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఘన వ్యర్థాలను కొనుగోలు చేసే వర్తకులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాలను విక్రయించేందుకు మొత్తం 12 మండలాలల్లోని 13 పంచాయతీలకు వెయిటింగ్‌ మిషన్లు అందజేసినట్లు తెలిపారు. తడి చెత్తతో వర్మి కంపోస్టు తయారు చేసుకుని దానిని రైతులకు విక్రయించటం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకోవాలని డీపీఓ సూచించారు. ఘన వ్యర్ధాలను విక్రయించటంలో సెర్చ్‌ సంస్థ సహకారం తీసుకోవాలని చెప్పారు. తడి, పొడి చెత్తల నిర్వహణల పట్ల పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పారు. జగనన్న స్వచ్ఛ సంకల్పంతో గ్రామాలు పరిశుభ్రమవుతాయని శంకర్‌నాయక్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎలీషాబాబు, సెర్చ్‌ సంస్థ ప్రతినిధి శ్రీకృష్ణ, దమ్మనవారిపాలెం సర్పంచి గురపసాల వెంకటేశ్వరమ్మ ఉన్నారు.

డీపీఓ శంకర్‌నాయక్‌

మరిన్ని వార్తలు