గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలి

4 Dec, 2023 02:44 IST|Sakshi
ఎన్‌టీఎఫ్‌ నూతన కార్యవర్గం

బాపట్ల: గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని నేషనల్‌ ట్రైబల్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కుంభ ఉదయ్‌కుమార్‌ పేర్కొన్నారు. బాపట్లలోని ఎన్జీఓ హోమ్‌లో జిల్లా గిరిజన ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలో 33 లక్షలకుపైగా ఉన్న గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గిరిజనులకు నివేశన స్థలాలు ఇవ్వలని కోరారు. హాస్టల్‌లో చదువుకుంటున్న గిరిజనుల విద్యార్థుల సమస్యలు పరిష్కారించాలని సూచించారు.

నూతన కమిటీ ఎంపిక

జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా దేవరకొండ రాము, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉయ్యాల శివ, సెక్రటరీగా కట్ట పెద్దన్న, కోశాధికారిగా అంగడి వెంకటేశ్వర్లు, సంయుక్త సెక్రటరీగా ఉయ్యాల గురవయ్య, సలహాదారులు బొజ్జ గాని రవికుమార్‌, దేవర ప్రసాద్‌, కట్టా కామేశ్వరి, వల్లెపు పూర్ణ, పాలపర్తి నాగరాజులను ఎన్నికయ్యారు.

>
మరిన్ని వార్తలు