జగనన్న సీఎంగా మరోసారి చరిత్ర సృష్టిస్తారు

4 Dec, 2023 02:44 IST|Sakshi
ఎమ్మెల్సీ రఘురాజుతో పాదయాత్ర చేస్తున్న నాయకులు
ఎమ్మెల్సీ రఘురాజు

మార్టూరు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజాతీర్పుతో రెండోసారి గెలిచి చరిత్ర సృష్టించనున్నారని శాసన మండలి సభ్యుడు హిందుపురి రఘురాజు పేర్కొన్నారు. ‘జయహో జగనన్న– చలో తిరుమల’ పేరుతో చేపట్టిన పాదయాత్ర బృందం ఆదివారం ఉదయం మార్టూరు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ రెండోసారి ముఖ్యమంత్రి కావాలని విజయనగరం జిల్లా బొడ్డావల గ్రామం నుంచి తిరుమలకు 820 కిలోమీటర్లు పాదయాత్రగా బయలుదేరి 43 రోజుల అనంతరం మార్టూరు చేరినట్లు వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే మరోసారి పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బొల్లాపల్లి టోల్‌ప్లాజా వరకు దర్శి, కోనంకి గ్రామాల మీదుగా పాదయాత్రగా బయలుదేరి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పఠాన్‌ కాలేషావలి, పార్టీ నాయకులు బాబూనాయక్‌, రాజా నాయక్‌, సుకుందరావు, రవిచంద్‌, గడ్డం మస్తాన్‌వలి, సులేమాన్‌, మైలా చిననాగేశ్వరరావు, జానీ బాషా, వినుకొండ సుధాకర్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు