ఘనంగా విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం

4 Dec, 2023 02:44 IST|Sakshi

కొరిటెపాడు: జగన్నామ సంక్షేమ సంవత్సరంలో భాగంగా పొన్నూరు నియోజకవర్గంలోని తొమ్మిది మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేసినట్టు బజరంగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అంబటి మురళీకృష్ణ తెలిపారు. పొన్నూరు మండలం ములుకుదురులో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ ట్రైసైకిళ్లు పంపిణీ చేసినట్టు వివరించారు. ఒకరికి జైపూర్‌ కాలును కూడా తయారు చేయించి అందించామని తెలిపారు. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో దివ్యాంగుల కోసం దివ్యాంగదర్శిని పేరిట ఈ కార్యక్నమాన్ని చేపట్టామని చెప్పారు. అవసరమైన దివ్యాంగులకు జైపూర్‌ కాళ్లు, చేతులు తయారు చేయించి వారి ఇళ్ల వద్దకు వెళ్లి అందిస్తున్నట్టు తెలిపారు.

ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన

బజరంగ్‌ ఫౌండేషన్‌

>
మరిన్ని వార్తలు