రైతును రాజు చేసేందుకు ప్రభుత్వం కృషి

4 Dec, 2023 02:44 IST|Sakshi

గుంటూరురూరల్‌: రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించి రైతును రాజు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. నగర శివారు లాంఫాంలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ దినోత్సవం సందర్భంగా అగ్రి టెక్‌–2023 వ్యవసాయ సాంకేతిక సదస్సును మంత్రి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ రకాల వ్యవసాయ అనుబంధ స్టాల్స్‌ను మంత్రి పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా భారతదేశంలోనే ఎక్కడ లేని వ్యవస్థని ఏర్పాటు చేసి శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం రైతులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యం రైతన్న అని, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయ స్థితిగతులు బాగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం, జగనన్న ఎల్లపుడూ సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. పంట పొలంలో ఉన్న రైతన్న తన సమస్యకు వెంటనే పరిష్కారం తెలుసుకునేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ను జగనన్న ప్రారంభించారన్నారు. దీని ద్వారా రైతును ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా కృషి చేస్తుందో తెలుసుకోవచ్చన్నారు. రైతన్నలకు కూలీల సమస్యలు తీర్చేందుకు డ్రోన్‌ టెక్నాలజీని అందించటంతోపాటు డ్రోన్‌ నడిపేందుకు అవసరమైన సాంకేతిక సహకారం, డీజీసీఏ ఆమోదం పొందిన డ్రోన్‌ పైలట్‌ ట్రైనింగ్‌ను అందించటంలో ఎన్జీరంగా వి శ్వవిద్యాలయం దేశంలోనే ముందంజలో ఉందన్నారు. వి శ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌ శారద జయలక్ష్మిదేవి మా ట్లాడుతూ వ్యవసాయ విద్య ది నోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. రాష్ట్ర ప్ర భుత్వం, విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించే ఈ సదస్సులో వ్యవసాయ పరమైన విషయాలను రైతులతో శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులు చర్చించి చర్యలు తీసుకుంటారన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ

మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

ఎన్జీరంగా వర్సిటీలో అగ్రి టెక్‌

వ్యవసాయ సాంకేతిక సదస్సు ప్రారంభం

మూడు రోజులపాటు

కొనసాగనున్న సదస్సు

శాస్త్రవేత్తలతో రైతుల ముఖాముఖి

ఆకట్టుకున్న 125 వ్యవసాయ

అనుబంధ స్టాల్స్‌

చిన్న పరిశ్రమల స్థాపనకు అవకాశాలు

ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ప్రతినిధి ఎల్‌ శ్రీధర్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో సూక్ష్మ, చిన్న పరిశ్రమలు స్థాపనకు అవకాశాలు వివరించారు. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ డీఎన్‌హెచ్‌ జీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నేల ఆరోగ్యం కోసం సమగ్ర యాజమాన్యం, నూతన ఎరువులు గురించి తెలిపారు. బయో ఇస్తేటిక్స్‌ సంస్థ ప్రతినిధి డాక్టర్‌ కె.ఆర్‌.కె రెడ్డి మాట్లాడుతూ స్థిరమైన వ్యవసాయం కోసం జీవ, పునరుత్పత్తి పద్ధతులు తెలిపారు. సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు, నూతన ఆవిష్కరణలు ఆర్‌జీ అగర్వాల్‌ వివరించారు. రైతులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులతో రైతుల సమస్య లు, ప్రశ్నలకు సమాధానాలు అందించారు. రైతులతో వారి సమస్యలపై ముఖాముఖి మాట్లాడారు. అగ్రిటెక్‌ ప్రదర్శనలో అనేక రకాల వ్యవసాయ ఆవిష్కరణలను ప్రదర్శించారు. అందులో వివిధ పంటల్లో నూతన వంగడాలు వాటి ఉత్పత్తి స్టాల్స్‌, కలుపు తీసే రోబోట్లు, ఆగ్రోమోటోరోలాజికల్‌ ఫార్మాస్టింగ్‌ సిస్టమ్స్‌, పంట కోతకు ఉపయోగించే నూతన యంత్రాలు, సేంద్రియ వ్యవసాయంలో ఉత్పత్తులు, వ్యవసాయం చేసే విధానాల నమూనాలు, మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌, ఉత్పత్తులు, లాంఫాం పరిఽశోధన స్థానంలో సుమారు 15 రకాల పంట రకాలను కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థు లు, రైతులకు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ రైతులను, విద్యార్థులను ఆకట్టుకున్నాయి. పాలకమండలి సభ్యులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, అధికారులు 7వేల మందికిపైగా పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు