దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ

4 Dec, 2023 02:44 IST|Sakshi
దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక మాసం, ఆదివారంతో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆది దంపతుల దర్శనానికి భక్తులు విశేషంగా తరలివచ్చారు. తెల్లవారుజామున ప్రారంభమైన భక్తుల రద్దీ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగింది. అమ్మవారికి తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, శాంతి కల్యాణంతో పాటు నవగ్రహ హోమాల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. మహా మండపం లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు సర్వ దర్శనంతోపాటు రూ.100, రూ.300, రూ.500 టికెట్లు క్యూలైన్‌లో అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 11–40 గంటలకు అమ్మవారికి మహా నివేదన నిమిత్తం అన్ని దర్శనాలు నిలిపివేశారు. 12–20 గంటలకు తిరిగి అన్ని దర్శనాలు ప్రారంభం కావడంతో రద్దీ మరింత పెరిగింది.

>
మరిన్ని వార్తలు