బస్సు దగ్ధం ఘటనలో చీరాల ప్రయాణికులు సేఫ్‌

5 Dec, 2023 05:20 IST|Sakshi

చీరాలఅర్బన్‌: హైదరాబాద్‌ నుంచి చీరాల వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు సోమవారం తెల్లవారుజామున నల్గొండ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌తో ఇంజిన్‌లో మంటలు వ్యాపించి వెంటనే బస్సు మొత్తం దగ్ధమైంది. డ్రైవర్‌ అప్రమత్తతతో ప్రయాణికులందరిని దింపివేశారు. అయితే ఈఘటనలో ఒకరు బస్సులో ఉండిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అయితే మృతి చెందిన వ్యక్తి ఎవరనేది స్పష్టత రాలేదు. చివరకు మృతిచెందిన వ్యక్తి చీరాలకు చెందిన వారు కాకపోవడంతో చీరాల ప్రయాణికులు సేఫ్‌గా ఉన్నారు.

లబ్ధిదారులకు రెండు వాహనాలు అందజేత

నరసరావుపేట: నవోదయంలో తమకు ఉపాధి కల్పించాలని ధరఖాస్తు చేసుకున్న ఇద్దరు వ్యక్తులకు జగనన్న బడుగు వికాసం కింద మంజూరైన రూ.36లక్షల విలువైన రెండు వాహనాలను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ అందజేశారు. నవోదయంలో దరఖాస్తు చేసుకున్న క్రోసూరు మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఏకోలు రతన్‌బాబుకు 45శాతం సబ్సిడీపై గుంటూరు కోటక్‌ మహేంద్ర బ్యాంకు సౌజన్యంతో జగనన్న బడుగు వికాసం కింద రూ.10లక్షలు విలువైన బడా దోస్త్‌ వాహనం అందజేశారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన దర్శి మనీష్‌కు ఎస్‌బీఐ అందజేసిన రుణంతో జగనన్న బడుగు వికాసం కింద రూ.26లక్షల విలువైన ఇన్నోవా వాహనం అందజేశారు.

>
మరిన్ని వార్తలు