యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శిగా పద్మావతి

5 Dec, 2023 05:20 IST|Sakshi
జస్టిస్‌ వేణుగోపాలరావుకి స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు, అర్చకులు

కారంచేడు: యూటీఎఫ్‌ బాపట్ల జిల్లా కార్యదర్శిగా కారంచేడు ఎన్‌టీఆర్‌ నగర్‌ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రావి పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపల్లెలో నిర్వహించిన యూటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో పద్మావతిని ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం మండలంలోని యూటీఎఫ్‌ మండల కమిటీ గౌరవాధ్యక్షుడు క్రిష్టఫర్‌, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్రీనివాసరావు, జీ రమేష్‌రెడ్డి, ఉపాధ్యక్షులు పావులూరి శ్రీనివాసరావు, భవానీప్రసాద్‌, ప్రమీల, రాజు, శైలజ, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

అమరేశ్వరుని దర్శించుకున్న హైకోర్టు జస్టిస్‌ వేణుగోపాలరావు

అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసి ఉన్న బాలచాముండికా సమేత అమరేశ్వరుని సోమవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి వేణుగోపాలరావు దర్శించుకున్నారు. తొలుత ఆలయ ఈవో వేమూరి గోపీనాథశర్మ, అర్చకులు హైకోర్టు న్యాయమూర్తి వేణుగోపాలరావు దంపతులకు స్వాగతం పలికి స్వామికి అభిషేకం, బాలచాముండేశ్వరీ దేవికి కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం జస్టిస్‌ వేణు గోపాలరావు దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రంతోపాటు తీర్ధప్రసాదాలు అందజేశారు.

>
మరిన్ని వార్తలు