బాపట్ల

5 Dec, 2023 05:20 IST|Sakshi
మంగళవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2023

శాంతి కల్యాణం

పెనమలూరు: యనమలకుదురులో వేంచేసి ఉన్న పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి శాంతి కల్యాణం సోమవారం ఘనంగా నిర్వహించారు.

చీరాల మండలం కఠారివారిపాలెంలో అల్లకల్లోలంగా కడలి

బాపట్ల/నిజాంపట్నం/చీరాల టౌన్‌/వేటపాలెం: మిచాంగ్‌ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు పల్నాడు, బాపట్ల జిల్లాల అధికారయంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. తుఫాన్‌ ప్రభావంతో సోమవారం రెండు జిల్లాల అంతటా ఈదురుగాలలతోపాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఫలితంగా కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరిచేలు నేలకొరిగాయి. బాపట్ల జాయింట్‌ కలెక్టర్‌ చామకురి శ్రీధర్‌ చీరాల వాడరేవు తీరాన్ని పరిశీలించారు. స్థానిక అధికారులు, ప్రజలతో మాట్లాడారు. సూచనలు, సలహాలు ఇచ్చారు. ముందస్తుగా వాడరేవుకు 40 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని తరలించామని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం, మంచినీరు, ఇతర వసతులు కల్పించినట్టు వెల్లడించారు. మత్స్యకారులు ఎవరూ ఈనెల 23 వరకు వేటకు వెళ్లకూడదని ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంట ఆర్డీఓ పి.సరోజిని, తహసీల్దార్‌ జీవిగుంట ప్రభాకరరావు, ఎంపీడీఓ నేతాజీ, రూరల్‌ సీఐ సోమశేఖర్‌, టౌన్‌ సీఐ శేషగిరిరావు, మైరెన్‌ ఎస్సై సుబ్బారావు, హౌసింగ్‌ ఈఏ శ్రీనివాసులు, ఆర్‌ఐలు శేఖర్‌, అర్జున్‌, ఎఫ్‌డీవో రాజ్‌కుమార్‌, పంచాయతీ సెక్రటరీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ఉన్నతాధికారులతో కలెక్టర్‌ సమీక్ష

జిల్లా ఉన్నతాధికారులతో బాపట్ల కలెక్టర్‌ రంజిత్‌బాషా సోమవారం తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. అత్యవసరంగా 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 800 మందికి ఆశ్రయం కల్పించామని వెల్లడించారు. 18 మంది గర్భిణులను వైద్యశాలలకు తరలించామని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. 43 తుఫాన్‌ షెల్టర్లు సిద్ధం చేసినట్టు వివరించారు. బాపట్ల జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్‌(నేషనల్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌), ఎస్డీఆర్‌ఎఫ్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌) బృందాలు మొత్తం 50 వచ్చాయని, వీటిని నిజాంపట్నం, వేటపాలెం, రేపల్లెలో సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు. 350 మంది ఈతగాళ్లు, 206 మెకనైజ్డ్‌ బోట్లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. పంటల నష్ట తీవ్రతను తగ్గించే ఏర్పాట్లను వ్యవసాయ అధికారులు చేపట్టాలని సూచించారు. 258 గ్రామాలలో పోలీస్‌ బృందాలను అందుబాటులో ఉంచినట్టు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కలెక్టర్‌కు వివరించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో కలిసి రెస్క్యూ చేపట్టేలా ప్రణాళిక రూపొందించుకున్నామని వెల్లడించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ సి.హెచ్‌.శ్రీధర్‌, అదనపు ఎస్పీ పి.మహేష్‌, డీఆర్వో పి.వెంకటరమణ పాల్గొన్నారు.

ఈదురుగాలులతో వాలుతున్న చేలు

ఈదురుగాలులతో అక్కడక్కడ చేలు వాలుతున్నాయి. దీంతో రైతుల్లో వణుకు మొదలైంది. సాధ్యమైనంత వరకు నష్టతీవ్రతను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వ్యవసాయ, ఉద్యానశాఖల అధికారులు గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉన్నారు. టార్పాలిన్‌ పట్టాలను సిద్ధం చేశారు.

7

న్యూస్‌రీల్‌

అధికార యంత్రాంగం అప్రమత్తం

అల్లకల్లోలంగా కడలి ఈదురుగాలులు, ఓ మోస్తరు వాన అధికారులతో కలెక్టర్‌ సమీక్ష తీరప్రాంతాల్లో పర్యటన నేడూ పాఠశాలలకు సెలవు పునరావాస కేంద్రాలు ఏర్పాటు తీరప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

తీరప్రాంతంలో కలెక్టర్‌ పర్యటన

కలెక్టర్‌ రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఎమ్మెల్యే కోన రఘుపతితో కలిసి సూర్యలంక తీర ప్రాంతంలో సోమవారం పర్యటించారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. బాపట్ల జిల్లాకు వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం అధికారి బబ్లు బిశ్వాస్‌తో మాట్లాడారు. అనంతరం పునరావాస కేంద్రాలను పరిశీలించి వసతులపై ఆరా తీశారు. ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం సమీక్షిస్తున్నారని, ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా తట్టుకునేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు