పంట పొలాలను పరిశీలించిన మంత్రి మేరుగ

6 Dec, 2023 01:54 IST|Sakshi
వేమూరులో తడిసిన వరి పనలను పరిశీలిస్తున్న మంత్రి మేరుగ నాగార్జున

వేమూరు: తుఫాన్‌ తాకిడికి పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం అదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వేమూరులోని వరహాపురం రోడ్డులో నీటి మునిగిన పంట పొలాలను మంత్రి మంగళవారం పరిశీలించారు. మేరుగ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తుఫాన్‌ పరిస్థితులను సమీక్షిస్తున్నారని తెలిపారు. తుఫాన్‌ ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు జరిగిన పంట నష్టం అంచనా వేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించామని, వర్షాలు తగ్గిన తర్వాత పంట నష్టం అంచనాలు ప్రారంభిస్తారని తెలిపారు. రైతులు అధైర్య పడవద్దన్నారు. వర్షాలకు తడిసిన వరి పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు, చుండూరు, అమర్తలూరు మండలాల్లో పర్యటించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.

>
మరిన్ని వార్తలు