తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం

6 Dec, 2023 01:54 IST|Sakshi
అరపల్లిలో వరి పంటను పరిశీలిస్తున్న మోపిదేవి
రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు

రేపల్లె రూరల్‌: మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాజ్యసభ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. మండలంలోని ఆరవపల్లి గ్రామంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తుఫాన్‌ ప్రభావంతో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాకుండా రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారన్నారు. తుఫాన్‌ హెచ్చరికలు వెలువడిన నాటి నుంచి జిల్లా, మండల స్థాయి యంత్రాంగం ప్రజలను చైతన్య భరిస్తూ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా శ్రమించిందన్నారు. నియోజకవర్గంలో 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు వసతి కల్పించినట్లు చెప్పారు. కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఆహారం, మందులు అందిస్తున్నామని చెప్పారు. తుఫాన్‌ తీవ్రత తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నీట మునిగి మొక్కలు వచ్చిన వరి కంకులను ఆయన పరిశీలించి వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు అంజయ్య, ఆరవపల్లి సర్పంచి లోయ బాబు నాంచారయ్య, వ్యవసాయ శాఖ ఏడీఏ సయ్యద్‌ అక్తర్‌ హుస్సేన్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు