జిల్లా డేటా ప్రాసెసింగ్‌ సెంటర్‌ ప్రారంభం

6 Dec, 2023 01:54 IST|Sakshi

సత్తెనపల్లి:సత్తెనపల్లిలోని తహసీల్దార్‌ కార్యాలయంలో జిల్లా డేటా ప్రాసెసింగ్‌ సెంటర్‌ (రీ సర్వే, భూమి రికార్డుల శాఖ)ను పల్నాడు జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ మంగళవారం ప్రారంభించారు. కలెక్టర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రీ సర్వేకి సంబంధించి టీం వర్క్‌గా పని చేసేందుకు ఈ సెంటర్‌ దోహద పడుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన రీ సర్వే, భూమి రికార్డులకు సంబంధించి ఇక్కడ పనిచేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. సెంటర్‌కు కావలసిన సిస్టమ్స్‌ ఏర్పాటుచేసినట్లు చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, సత్తెనపల్లి ఆర్డీఓ బీఎల్‌ఎన్‌ రాజకుమారి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు