మా పని అంతే..

28 Apr, 2023 00:20 IST|Sakshi

ఇసుక అక్రమ మాఫియాను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా మైనింగ్‌, టీఎస్‌ఎండీసీ, రవాణా, పోలీ స్‌, రెవెన్యూ విభాగాలపై ఉంది. ఎవరైనా ఈ అవినీతి వ్యవహారంపై ఫిర్యాదు చేసినా ప్రతీ శాఖలో సంబంధిత అధికారులు ఆ బాధ్యత తమది కాదని, మరో శాఖదని సమాధానం చెప్పడం పరిపాటిగా మారింది. ఇసుక దందాపై టీఎస్‌ఎండీసీ అధికారులను ప్రశ్నిస్తే ఇసుక అమ్మకాలను పర్యవేక్షించడమే తమ పని తప్పితే తవ్వకాల నిర్వహణతో తమకు సంబంధం లేదంటారు. కీలకమైన మైనింగ్‌ శాఖను ప్రశ్నిస్తే అనుమతులు ఇవ్వడమే తమ పని అని చెబుతారు. లేదంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని జవాబిస్తారు. ఇంత వరకు ఏ ఒక్క రీచ్‌లో ఇసుక తవ్వకాలకు ఎంత పరిధి మేరకు అనుమతి తీసుకున్నారు ? ఎంత వరకు తవ్వారు? అనే అంశాలపై లెక్కలు లేవు. అనుమతి వస్తే చాలు గోదావరి అంతా తమదే అన్నట్టుగా మారింది పరిస్థితి.

>
మరిన్ని వార్తలు