జలసంరక్షణలో జాతీయ అవార్డు

18 Jun, 2023 00:10 IST|Sakshi

ఉపరాష్ట్రపతి చేతులమీదుగా స్వీకరించిన జగన్నాథపురం సర్పంచ్‌, కార్యదర్శి

అభినందించిన కలెక్టర్‌ అనుదీప్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం) : జల సంరక్షణ విభాగంలో ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు రాగా, ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ ప్లీనరీ హాల్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధంఖర్‌ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్‌ గడ్డం భవాని, కార్యదర్శి షేక్‌ ఇబ్రహీం శనివారం పురస్కారం స్వీకరించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీల్లో 41 మంది విజేతలను ప్రకటించగా జల సంరక్షణలో ఉత్తమ పంచాయతీగా జగన్నాథపురం నిలిచిన విషయం తెలిసిందే.

గ్రామానికి అవార్డు రావడం పట్ల కలెక్టర్‌ అనుదీప్‌ హర్షం వ్యక్తం చేశారు. ప్రశంసపత్రంతో పాటు నగదు బహుమతి అందుకున్నారని తెలిపారు. జాతీయస్థాయిలో జల సంరక్షణలో మొదటి స్థానం సాధించేందుకు కృషి చేసిన ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, సహకరించిన ప్రజలను ఆయన అభినందించారు. జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులు అందజేస్తున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు