పాఠశాలల అభివృద్ధికి సహకరించండి

19 Nov, 2023 00:18 IST|Sakshi
మాట్లాడుతున్న డీఈఓ వెంకటేశ్వరా చారి

పాల్వంచ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తల్లిదండ్రులు సంపూర్ణంగా సహకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరాచారి కోరారు. స్థానిక గాంధీనగర్‌లోని మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. తమ పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలని, పాఠశాలల్లో జరిగే ఇలాంటి సమావేశాల్లో పాల్గొని విద్యార్థుల ప్రగతి ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పేరెంట్స్‌కు సూచించారు. ఉపాధ్యాయులతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని, పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని అన్నారు. చదువులో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కో ఆర్డినేటర్‌ ఎ.నాగరాజశేఖర్‌, ఎస్‌కే.సైదులు, ఎన్‌.సతీశ్‌కుమార్‌, ఎంఈఓ శ్రీ రామ్మూర్తి, కాంప్లెక్స్‌ హెచ్‌ఎం పద్మలత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు