-

బెల్టుషాపు నిర్వాహకులపై కేసు నమోదు

28 Nov, 2023 00:28 IST|Sakshi

భద్రాచలంఅర్బన్‌: నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. రాజుపేట కాలనీకి చెందిన చిలకమ్మ వద్ద రూ. 1500 విలువైన నాటుసారా, సూపర్‌బజార్‌కు చెందిన సందీప్‌ వద్ద రూ.2000 విలువైన మద్యం, సుందరయ్య నగర్‌ కాలనీకి చెందిన పవన్‌కల్యాణ్‌ వద్ద రూ.1700 విలువైన మద్యం సీజ్‌ చేసినట్లు సీఐ నాగరాజు రెడ్డి తెలిపారు.

మద్యం సీజ్‌

దమ్మపేట: అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను ఎఫ్‌ఎ్‌స్‌ టీం, పోలీసులు సీజ్‌ చేశారు. సోమవారం దమ్మపేటలోని ప్రధాన రహదారిపై రెండు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై అక్రమంగా తరలిస్తున్న 224 మద్యం క్వార్టర్‌ సీసాలను పోలీసులు గుర్తించారు. ఈ మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశామని ఎఫ్‌ఎస్‌ టీం అధికారి కృష్ణ, ఎస్సై రవికుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు