-

ఖమ్మం మహిళా కబడ్డీ జట్టు ఎంపిక

28 Nov, 2023 00:28 IST|Sakshi
ఎంపికైన క్రీడాకారులతో అసోసియేషన్‌ బాధ్యులు

ఖమ్మం స్పోర్ట్స్‌: ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌స్టేడియంలో సోమవారం జిల్లా స్థాయి సీనియర్‌ మహిళ కబడ్డీ జట్టును ఎంపిక చేశారు. ఈ ఎంపిక పోటీలకు 61 మంది క్రీడాకారులు హాజరుకాగా, ప్రతిభ కనబర్చిన వారితో నిజామాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టుకు ఎంపిక చేశామని కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్‌బాబు తెలిపారు. జట్టుకు భవాని, స్వప్న, పూజిత, అఖిల, ప్రియాంక, కుసుమ, అశ్విని, నాగమణి, కావేరి, విజయ, శ్రీభాను, సంధ్య, భవాని, స్పందన, నిఖిత, వెనీల ఎంపిక కాగా, పోటీలను సీహెచ్‌.సుధాకర్‌, జి.శివజ్యోతి, జి.దివ్య, ఎం.సునీత, వి.సత్యనారాయణ, కె.లాలయ్య, ఐ.పవన్‌కుమార్‌, ఎం.శోభన్‌కృష్ణ పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు