-

పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం

28 Nov, 2023 00:32 IST|Sakshi
చండీహోమం నిర్వహిస్తున్న అర్చకులు

పాల్వంచ : మండల పరిధిలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం చండీహోమం నిర్వహించారు. మేళతాళాలు, వేద మంత్రాల నడుమ అమ్మవారి ఉత్సవ విగ్రహాలను యాగశాలకు తీసుకొచ్చారు. మండపారాధన, గణపతి పూజ అనంతరం చండీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అంతకుముందు దేవస్థానంలోని శివలింగానికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. ఆ తర్వాత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఈఓ ఎన్‌.రజినీకుమారి, అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

నేటి నుంచి మద్యం షాపుల మూసివేత

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/కొత్తగూడెంఅర్బన్‌ : ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి పోలింగ్‌ ప్రక్రియ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ప్రియాంక ఆల ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబర్‌ 3వ తేదీన కూడా ఉదయం 6 గంటల నుంచి ఫలితాలు వెలువడేంత వరకు మూసి ఉంచాలని పేర్కొన్నారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం నుంచి 30వ తేదీ సాయంత్రం వరకు, డిసెంబర్‌ 3వ తేదీన జిల్లాలోని వైన్‌, బార్‌షాపు బంద్‌ చేయాలని జిల్లా ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారి జానయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తలు