‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం..’

29 Nov, 2023 00:22 IST|Sakshi

ఖమ్మంఅర్బన్‌: బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు తోడుదొంగలని ప్రజలు గుర్తించిన నేపథ్యాన ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఖమ్మంలోని పలు డివిజన్లతో పాటు రఘునాథపాలెం మండలంలో ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంగళవారం జరిగిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి కోసం పాటు పడే తుమ్మల నాగేశ్వరరావును గెలిపించాలని కోరారు. కేసీఆర్‌ ఖజానా నింపుకుని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని.. దీంతో బీజేపీని ఆశ్రయించి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారని ఆరోపించారు. కాగా, బీఆర్‌ఎస్‌ పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగని నేపథ్యాన కాంగ్రెస్‌, మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని నారాయణ కోరారు. ఈకార్యక్రమంలో నాయకులు మానుకొండ రాధాకిషోర్‌, లకావత్‌ సైదులు, మలీదు జగన్‌, మలీదు వెంకటేశ్వర్లు, నల్లమల వెంకటేశ్వర్లు, చోటా బాబా, బాషా, భూక్యా గౌరి, రేమళ్ల రమేష్‌, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఓటరు చైతన్య యాత్ర ముగింపు

కల్లూరు రూరల్‌: కల్లూరు మండలం చెన్నూరుకు చెందిన దంతాల సుధాకర్‌ ఓటర్లలో చైతన్యం కల్పించేలా చేపట్టిన బైక్‌ యాత్ర మంగళవారం ము గిసింది. ఈ సందర్భంగా ఖమ్మం చేరుకున్న ఆయ నను కలెక్టర్‌ గౌతమ్‌ అభినందించారు. వంద శాతం పోలింగ్‌ నమోదయ్యేలా పది రోజుల పాటు యాత్ర చేపట్టానని సుధాకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు