నగదు సీజ్‌

29 Nov, 2023 00:22 IST|Sakshi
నగదు సీజ్‌ చేస్తున్న అధికారులు

దమ్మపేట: దమ్మపేట శివారు నెమలిపేటలోని పెట్రోల్‌బంక్‌ సమీపంలో ఏపీ రాష్ట్రం ఏలూరు నుంచి భద్రాచలం వైపునకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా రూ.10 లక్షల నగదును గుర్తించారు. మందలపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద చేస్తున్న తనిఖీల్లో కారులో రూ.80,000ల నగదును గుర్తించారు. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో సీజ్‌ చేశామని ఎఫ్‌ఎస్‌ టీం అధికారి కృష్ణ, ఎస్‌ఐ రవికుమార్‌ మంగళవారం తెలిపారు.

భారీగా మద్యం సీజ్‌

దమ్మపేట: ఎన్నికల నిబంధనల మేరకు చేస్తున్న తనిఖీల్లో భారీగా మద్యం సీసాలను పోలీసులు సీజ్‌ చేశారు. మంగళవారం మండల కేంద్రం దురదపాడు గ్రామంలో ఎఫ్‌ఎస్‌ టీం అధికారి కృష్ణ తనిఖీలు నిర్వహించగా అక్రమంగా నిల్వ చేసిన 695 క్వార్టర్‌ సీసాలు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకొని, సీజ్‌ చేశామని పోలీసులు చేశారు.

మరిన్ని వార్తలు