ముక్కోటి ఏర్పాట్లు ప్రారంభం

29 Nov, 2023 00:22 IST|Sakshi
రంగులు వేస్తున్న పెయింటర్లు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్‌ 13 నుంచి జనవరి 2 వరకు నిర్వహించే వైకుంఠ ఏకా దశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు గాను ఏర్పాట్లు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ద్వా రాలకు రంగులు వేయడం, విద్యుత్‌ దీపాలంకరణ, ఆలయం చుట్టూ చలువ పందిళ్ల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపడుతు న్న ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

1 నుంచి పునర్వసు దీక్ష

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వచ్చేనెల 1న కార్తీక మాస పునర్వసు నక్షత్రం రోజున శ్రీరామ పునర్వసు దీక్ష ప్రారంభమై 28వ తేదీన ముగుస్తుందని ఈఓ రమాదేవి తెలిపారు. అదేరోజు గిరి ప్రదక్షిణ, పాదుకాపూజ, దీక్షా విరమణ ఉంటాయని, రాత్రి 7 గంటలకు వెండి రథోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు