1,098 పోలింగ్‌ కేంద్రాలు

29 Nov, 2023 00:24 IST|Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో గల 701 లొకేషన్లలో మొత్తం 1,098 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పినపాక నియోజకవర్గంలో 7 మండలాలు ఉండగా ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో ఐదు చొప్పున ఉన్నాయి. వీటి పరిధిలో గురువారం పోలింగ్‌ జరగనుంది. జిల్లాలో పురుష ఓటర్లు 4,71,745 మంది, మహిళా ఓటర్లు 4,94,650, ఇతరులు 44.. మొత్తం 9,66,439 మంది ఓటర్లు ఉన్నారు.

నియోజకవర్గాల వారీగా ఇలా..

పినపాక నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా 147 లొకేషన్లలో 244 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ పురుష ఓటర్లు 97,821 మంది, మహిళా ఓటర్లు 1,00,577, ఇతరులు నలుగురు కలిపి మొత్తం 1,98,402 మంది ఓటర్లు ఉన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో కలిపి 172 లొకేషన్ల పరిధిలో 241 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ పురుష ఓటర్లు 1,07,909, మహిళా ఓటర్లు 1,11,658, ఇతరులు ఇద్దరు కలిపి మొత్తం 2,19,569 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి, మహబూబాబాద్‌ జిల్లా గార్ల, బయ్యారం మండలాలు కూడా ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కలిపి 137 లొకేషన్లలో 253 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ పురుష ఓటర్లు 1,18,385 మంది, మహిళా ఓటర్లు 1,25,434, ఇతరులు 27 కలిపి మొత్తం 2,43,846 మంది ఓటర్లు ఉన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా 124 లొకేషన్ల పరిధిలో 184 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ పురుష ఓటర్లు 76,193, మహిళా ఓటర్లు 79,761, ఇతరులు ఏడుగురు.. మొత్తం 1,55,961 మంది ఓటర్లు ఉన్నారు. భద్రాచలం నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పరిధిలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలు, వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలో ఉన్నాయి. ఈ ఐదు మండలాల్లో కలిపి 121 లొకేషన్లలో 176 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పురుష ఓటర్లు 71,437, మహిళా ఓటర్లు 77,220, ఇతరులు నలుగురు.. మొత్తం 1,48,661 మంది ఓటర్లు ఉన్నారు.

27 మండలాల్లో

9,66,439 మంది ఓటర్లు

మరిన్ని వార్తలు