పోలింగ్‌ సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు

29 Nov, 2023 00:24 IST|Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పోలింగ్‌ సామగ్రి పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ ప్రియాంక ఆల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విధులు కేటాయించిన సిబ్బంది బుధవారం ఉదయం 6 గంటల వరకు పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. గైర్హాజరైన వారిని ఎన్నికల నియమావళి ప్రకారం సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. మెటీరియల్‌ తీసుకున్న సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుని పోలింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

30న వేతనంతో కూడిన సెలవు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వ్యాపార సముదాయాలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా గురువారం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు ప్రియాంక ఆల తెలిపారు. ఈ మేరకు కార్మిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్‌ కేంద్రాలైన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు బుధవారం కూడా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు