లెక్కింపు కేంద్రం వద్ద పటిష్ట ఏర్పాట్లు..

29 Nov, 2023 00:24 IST|Sakshi

పాల్వంచ : ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రియాంక ఆల అన్నారు. స్థానిక అనుబోస్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని మంగళవారం ఆమె తనిఖీ చేశారు. విధులు నిర్వహించే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, లెక్కింపు కేంద్రంలో ఐరన్‌ మెష్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దేశిత స్థలంలోనే వాహనాలు నిలిపేలా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించాలని సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ కుసుమకుమారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ వినీత్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్వామి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు