టీఎన్జీవోస్‌ కార్యాలయంపై దాడికి నిరసన

6 Dec, 2023 00:22 IST|Sakshi
టీఎన్జీవోస్‌ కేంద్ర నాయకులతో అఫ్జల్‌ తదితరులు

ఖమ్మం సహకారనగర్‌: ఖమ్మంలోని టీఎన్జీవోస్‌ కార్యాలయంపై దాడి చేయడమే కాక అధ్యక్షుడు అఫ్జల్‌ హసన్‌ తదితరులపై భౌతికి దాడికి యత్నించడం గర్హనీయమని యూనియన్‌ బాధ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వివిధ శాఖల్లోని టీఎన్జీఓ సంఘం ప్రతినిధులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. యూనియన్‌ బలోపేతానికి కృషి చేయడమే కాక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న టీఎన్జీవోస్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అఫ్జల్‌ హసన్‌, ఆర్‌.వీ.ఎస్‌.సాగర్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అఫ్జల్‌ హాసన్‌, సాగర్‌ తదితరులు హైదరాబాద్‌లో కేంద్ర నాయత్వాన్ని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా దాడి వివరాలు, ఇందుకు దారి తీసిన పరిస్థితులను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నందగిరి శ్రీను, కార్యదర్శి జీ.ఎస్‌ ప్రసాద్‌, సవర్జన్‌ పాల్‌, వై.శ్రీనివాసరావు, పాషా, సుధాకర్‌ ఉన్నారు.

>
మరిన్ని వార్తలు