ఈ ఫోటోలోని వ్యక్తి ఎవరో గుర్తు పట్టగలరా..?!

13 Oct, 2021 09:48 IST|Sakshi

న్యూఢిల్లీ: మనం చిన్నప్పటి ఫోటోలను మన స్నేహితులకు చూపించి ఈ ఫోటోలో ఉంది ఎవరో చెప్పు అని అడుగుతాం. కానీ వాళ్లు మనమే అని కూడా సరిగా గుర్తు పట్టలేరు కదా. ఎందుకంటే వయసు పెరుగుతుంటే కొంచెం కొంచెంగా శరీరంలో మార్పులు సంతరించుకోవడంతే కొంచెం పోల్చుకోవడం కష్టం అనిపిస్తోంది. మరికొంత మందిని ఈజీగా గుర్తుపట్టేయగలం.

(చదవండి: ఆ కెమికల్‌ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి)

ఏంటి సోదీ అనుకోకండి ఇక్కడ ఒక ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌ తన చిన్ననాటి ఫోటోను సోషల్‌ మీడయోలో పోస్టు చేసి ఇతనెవరో గెస్‌ చేయండి ప్లీజ్‌ అంటు కామెంట్‌ జోడించి పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్‌ పెట్టి వార్తల్లో నిలిచే మిలిందా ఈసారి తన చిన్ననాటి స్మృతులను తన అభిమానులతో పంచుకున్నాడు.


ఇది తాను ఆరేళ్ల వయసులో ఉండగా తీసిన పోటో అంటూ చెప్పుకొచ్చాడు. పైగా తాను ఆ వయసులో మంచి రైతు అవ్వాలని అనుకున్నాడట. కానీ ఇప్పుడు ఈ 50 ఏళ్ల వయసులో కృత్రిమంగా కూరగాయాలు ఎలా పండించాలో తెలుసుకుంటున్నాను అంటున్నాడు. ప్రస్తుతం మిలింద్‌ సోమన్‌ మలైకా అరోరా  అనూష దండేకర్‌తో కలిసి టీవీ రియాలిటీ షో సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్ రెండవ సీజన్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

(చదవండి:  టైంకి ఎయిర్‌పోర్ట్‌కి చేరాలంటే ట్రాక్టర్‌పై వెళ్లక తప్పదు)

మరిన్ని వార్తలు