ఐ లవ్‌ యూ ప్రియాంక..స్పెషల్‌ విషెస్‌

1 Dec, 2020 20:28 IST|Sakshi

ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్‌ జోనాస్‌ తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రెండేళ్ల క్రితం ఇదే రోజున జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో ఒకటయ్యారు ఈ జంట. క్రైస్తవ పద్ధతిలో వివాహం చేసుకున్న ఫోటోలను షేర్‌ చేసి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా భార్య ప్రియాంకకు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశాడు పాప్‌స్టార్‌. దీనిపై ప్రియాంక స్పందించిన తీరు అభిమానుల హృదయాలను దోచుకుంది. అద్భుతమైన, అందమైన  స్త్రీని వివాహమాడి సరిగ్గా రెండేళ్లు అయ్యిందని, 'హ్యాపి వెడ్డింగ్‌ అనివర్సరీ ఐ లవ్‌ యూ ప్రియాంక' అని నిక్‌ చేసిన పోస్ట్‌ పై ప్రియాంక స్పందించింది. (చదవండి: లాక్‌డౌన్‌పై కాజోల్ క్రేజీ క్యాప్ష‌న్)

'నువ్వే నా బలం, బలహీనత, ఎల్లప్పుడూ నా వెంటే ఉండే నా ధైర్యం.. ఐ లవ్‌ యూ నిక్‌' అంటూ ప్రియాంక సోషల్‌ మీడియా వేదికగా భర్తకు శుభాకాంక్షలు తెలిపింది. 2018 డిసెంబర్‌ 1న క్రైస్తవ పద్ధతిలో ఒకటైన ఈ జంట డిసెంబర్‌ 2వ తేదీన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఢిల్లీ, ముంబైలలో గ్రాండ్‌గా రెండుసార్లు రిసెప్షన్‌ చేసుకున్నారీ జంట. కుటుంబ సభ్యులు, బాలీవుడ్‌ నటీనటులు, పలువురు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రియాంక చోప్రా ఇటీవల జర్మనీ యాక్టర్‌ కియానో రీవ్స్‌తో కలిసి షూటింగ్‌ ముగించింది. తరువాత నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న 'ది వైట్‌ టైగర్‌'లో కనిపించనుంది. ఈ సినిమా 'అరవింద్‌ అడిగా' అనే బుక్‌ ఆధారంగా తెరకెక్కనుంది. రాజ్‌కుమార్‌రావ్‌, ఆదర్ష్‌ గౌరవ్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదల అయ్యింది. హాలీవుడ్‌లో 'వి కెన్‌ బీ హీరోస్‌'లో కూడా ప్రియాంక కనిపించనుంది. ఈ సినిమాను రాబర్ట్‌ రోడ్రిక్వేజ్‌ నిర్మించనున్నారు.

Read latest Bollywood News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా