లాభాల జోరు; 49 వేల ఎగువకు సెన్సెక్స్‌

7 May, 2021 13:46 IST|Sakshi

14800పైన నిఫ్టీ

ఐటీ, మెటల్‌,  బ్యాంకింగ్‌ షేర్ల లాభాలు

సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. వరసగా మూడో రోలాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్‌ ఒక దశలో 500 పాయింట్లకు  పైగా ఎగసింది, నిఫ్టీ మరోసారి 15 వేల పాయింట్లకు చేరువలో వచ్చింది. కానీ మిడ్‌  సెషన్‌ నుంచి లాభాల స్వీకరణ  కారణంగా సెన్సెక్స్‌  205 పాయింట్ల లాభాలకు పరిమితమై 49155 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు ఎగిసి 14802 వద్ద ఉన్నాయి. కానీ మద్దతు స్థాయిల వద్ద పట్టిష్టంగానే ట్రేడ్‌ అవు తున్నాయి.

బ్యాంక్, ఐటీ, మెటల్ స్టాక్స్  లాభాల్లోనూ  ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో  స్వల్ప నష్టాలు కనిపిస్తున్నాయి. టాటా స్టీల్,  జేఎస్‌డబ్ల్యూ స్టీల్  టాప్‌ గెయినర్స్ గా ఉండగా, ఇంకా ఇండస్ఇండ్ బ్యాంక్,ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్,  హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్  లాభాల్లోనూ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఐషర్ మోటర్స్, బిపిసిఎల్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.

చదవండి : సింగిల్‌ డోస్ స్పుత్నిక్ లైట్ వచ్చేసింది: రష్యా
సీటీ స్కాన్‌: ఎయిమ్స్ డైరెక్టర్  వాదనలను ఖండించిన ఐఆర్ఐఏ

మరిన్ని వార్తలు